భూ బకాసురులు

11 Jul, 2014 00:36 IST|Sakshi
భూ బకాసురులు
 •       జిల్లాలో వేలాది ఎకరాలు ఆక్రమణ
 •      న్యాయస్థానాల్లో 900 భూవివాదాల కేసులు
 •      రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానం
 •      సబ్‌రిజిస్ట్రార్ల పాత్రపై విచారణ వచ్చే వారం ‘రెవెన్యూ’ ప్రత్యేక సమావేశం
 •  విశాఖ రూరల్: ప్రభుత్వ భూముల సర్వేలో అ నేక అక్రమాలు బయటపడుతున్నాయి. వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు ఉన్నతాధికారు ల పరిశీలనలో వెల్లడైంది. రూ.వేల కోట్లు విలువైన భూములకు సంబంధించిన వివాదాలు న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 900 భూ వివాదాల కేసులు జిల్లా, హైకోర్టులో ఏళ్ల తరబడి నడుస్తున్నట్లు లెక్కతేలాయి.

  వీటిలో చాలా కేసులకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై వచ్చే వారంలో సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల రోజులుగా జిల్లాలో ప్రభుత్వ భూ ముల సర్వే జరుగుతోంది. ప్రభుత్వ భూము లు, ఇతర శాఖలకు కేటాయించినవి, ఆక్రమణకు గురైనవి, కోర్టు వివాదాల్లో ఉన్నవి.. ఇలా నాలుగు కేటగిరీల కింద సర్వే చేపడుతున్నారు.
   
  కోర్టు వివాదాల్లో 900 కేసులు
   
  కోర్టు వివాదాల్లో ఉన్న భూముల వ్యవహారాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్‌లు విస్తుపోయారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసులు నలుగుతున్నా వాటి పరిష్కారానికి కనీస చర్యలు లేవన్న విషయాన్ని గుర్తించారు. దాదాపు  900 కేసులు జిల్లా కోర్టు, హైకోర్టుల్లో ఉన్నట్టు లెక్క తేల్చారు. దసపల్లా లేఅవుట్, క్లోవర్ అసోసియేట్స్, డచ లేఅవుట్, కిర్లంపూడి లేఅవుట్, నడుపూర్, తాజాగా సర్వే నెంబర్ 152 ఇలా విశాఖ పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాం తాల్లో కూడా కోట్లు విలువైన వేలాది ఎకరాల భూ వివాదాలు కోర్టుల్లో ఉన్నాయి.
   
  వీటిలో చాలా వరకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించ డం, పక్క సర్వే నంబర్లతో భూములు కొట్టేయడానికి ప్రయత్నించడం, భూములు ఆక్రమించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం.. ఇలా అనేక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. వివాదాల్లో ఉన్న చాలా భూములకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు రికార్డుల ద్వారా స్పష్టం గా తెలుస్తున్నా.. వాటిని సక్రమంగా కోర్టుకు సమర్పించడం లేదు. ఫలితంగా కేసులు కోర్టుల్లో దీర్ఘకాలంగా నడుస్తూనే ఉన్నాయి.
   
  అధికారులు పాత్రపై అనుమానాలు
   
  చాలా భూముల కేసుల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. తాజాగా సర్వే నెంబర్ 152/4 వ్యవహార మే నిదర్శనం. నడుపూర్‌లో పక్క భూముల సర్వే నంబర్‌తో కోట్లు విలువ చేసే భూములు కాజేయడానికి ప్రైవేటు వ్యక్తులు కోర్టులో కేసు వేశారు. తప్పుడు సర్వే నంబర్ వేసిన విషయా న్ని కోర్టుకు విన్నవిస్తే కేసు వేగంగా పరిష్కారమవుతుంది. అయినప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

  ఇలా చాలా వివాదాలకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది సక్రమం గా స్పందించ డం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందే ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఈ అక్రమాలకు సహకరిస్తున్నారన్న వా ర్తలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయా యి. రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా చేపట్టారన్న విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వీటిపై విచారణకు సైతం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం కేసుల విషయాలన్నింటిపై వచ్చే వారంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
   

మరిన్ని వార్తలు