హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు.. అందరిదీ

26 Oct, 2013 14:48 IST|Sakshi
హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు.. అందరిదీ

హైదరాబాద్ : హైదరాబాద్లో ఏ ప్రాంత ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన  అవసరం లేదని వైఎస్ఆర్ సీపీ నేత రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్ అందరిదని, హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మనే అర్హత ఏ ఒక్కరికి లేదన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని రణన్నినాదం చేశారు. 'జబ్ సీధీ ఉంగ్లీ సే ఘీ నహీ నికలీతో ఉంగ్లీ టేఢీ కర్నీ పడేగీ' (వేలు తిన్నగా ఉంచితే డబ్బాలోంచి నెయ్యి రాదు.. వేలు వంకరగా పెట్టాల్సిందే) అంటూ సమైక్యరాష్ట్రం కోసం ఏమైనా చేస్తామన్నారు.

ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో రెహ్మాన్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని చూసి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమైక్య శంఖారావం కోసం  వస్తున్నవందలాది బస్సులను తెలంగాణ ప్రాంతాలలో నిలిపేశారని, పోలీసులు ఆ బస్సులను తక్షణమే అనుమతించాలని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావుకు రెహ్మాన్ విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీలో 190కి చేరిన పాజిటివ్‌లు

ఉభయ ‘మారకం’

ఇంటి ముంగిటే పంట కొనుగోలు

అత్యవసర వైద్య సేవలను.. నిరాకరించొద్దు

భారతీయులుగా పోరాడదాం

సినిమా

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు