అరవై ఏళ్లు దాటితే  హోం క్వారంటైన్‌

23 Jul, 2020 05:49 IST|Sakshi

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడకూడదు

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైరస్‌ నుంచి కాపాడుకునేందుకు ముఖ్యంగా అరవై ఏళ్ల వయసు పైబడిన వారు, మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్, హెచ్‌ఐవీ బాధితులు తదితరులందరూ బయటకు రాకుండా మరో నెలరోజులు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీరికి వైరస్‌ సోకితే మిగతా వారికంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. వీరంతా హైరిస్క్‌ కేటగిరీలో ఉన్నందున కుటుంబ సభ్యులు వీరిపట్ల అత్యంత జాగ్రత్త వహించాలని సర్కారు ఆశాకార్యకర్తల ద్వారా, ఏఎన్‌ఎంల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

► మన రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వారు 50 లక్షల మందివరకూ ఉన్నారు.
► ఎట్టిపరిస్థితుల్లోనూ వీరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి.
► కుటుంబ సభ్యులు బయట తిరిగి వచ్చినా వీరికి దూరంగా ఉండటం మంచిది. అరవై ఏళ్లు పైబడిన వారు ప్రత్యేక గదిలో ఉండాలి. ప్రస్తుతం వాడుతున్న మందులు కొనసాగించాలి..వాటిని ఆపకూడదు.
► కొంతమంది ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు వాడుతున్నారు.  వీటిని వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు