విభజన ప్రక్రియలో భాగస్వామి కాలేను: ఆంజనేయ రెడ్డి

29 Oct, 2013 09:36 IST|Sakshi

విశాలాంధ్ర కోసమే కట్టుబడి ఉన్నానని మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి స్పషం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియలో తాను భాగస్వామిని కాలేనని ఆయన మంగళవారం హైదరాబాద్లో పేర్కొన్నారు.  రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలు, ఇతరత్ర అంశాలపై అధ్యాయనంపై కేంద్ర ప్రభుత్వం విజయ్కుమార్ నేతృత్వంలో ఓ టాస్క్ఫోర్స్ కమిటీ నియమించింది.

 

ఆ కమిటీ మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి కేంద్ర మానవ వనరుల అభివృద్ది సంస్థ లో ఆ టాస్క్ఫోర్స్ సమావేశం కానుంది. ఆ టాస్క్ఫోర్స్ కమిటీలో సభ్యులుగా ఆంజనేయరెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో  ఆ కమిటీతో ఆంజనేయరెడ్డి మరికాసేపట్లో భేటీ కానున్నారు. అందులోభాగంగా ఆంజనేయరెడ్డిపై విధంగా స్పందించారు.

మరిన్ని వార్తలు