'కార్మికులు సమ్మెకు వెళ్లడం నాకు బాధనిపిస్తోంది'

10 May, 2015 17:46 IST|Sakshi
'కార్మికులు సమ్మెకు వెళ్లడం నాకు బాధనిపిస్తోంది'

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సబ్ కమిటీ వేశాక కూడా కార్మికులు సమ్మెకు వెళ్లడం బాధనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు, యాజమాన్య పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటికీ మూడు వారాల గడువు కోరామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మాత్రం ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వలేమని అచ్చెన్నాయుడు తెలిపారు.

 

తక్షణమే సమ్మె విరమించి మూడు వారాల పాటు సమయం ఇవ్వలని కోరామని.. కార్మిక సంఘాలు రేపు మాట్లాడుకుని సమాధానం చెప్తామన్నాయన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినట్లు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు