108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే..

7 Oct, 2018 18:59 IST|Sakshi
సభలో ఆవేదన వ్యక్తం చేస్తున్న భవాని

సాక్షి, విజయనగరం : తన ఇంటిపక్కన ఉన్న గర్భిణీకి సడెన్‌గా పురిటినొప్పులు వస్తే తాను 108కి ఫోన్‌ చేశానని.. వారు మాత్రం టైర్‌ పంచ్చర్‌ అయ్యిందని, స్టాఫ్‌ లేదని వారు రాలేదని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుర్లలో బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే. సభ జరుగుతున్న సమయంలో కోడూరు మండలానికి చెందిన భవాని అనే యువతి బహిరంగ సభలో తన ఆవేదన వ్యక్తం చేశారు.

యువతి మాట్లాడుతూ.. ‘‘ మా ఇంటి పక్కన గౌరి అనే మహిళ పురిటినొప్పులతో బాధపడుతుంటే నేను వెంటనే 108కి ఫోన్‌ చేశాను. వారు వివరాలు అన్ని అడిగి చివరికి సిబ్బంది లేదు రాలేమూ అని ఫోన్‌ కట్‌ చేశారు. ఆమెను షేర్‌ ఆటోలో తీసుకుని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించాను. మరో పది నిమిషాలు ఆలస్యం అయ్యి ఉంటే ఆమె ప్రాణానికి ప్రమాదం జరిగి ఉండేది. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. నేను ఇంటర్‌లో 978 మార్కులు సాధించాను. అయినా నాకు ప్రభుత్వంమెరిట్‌ స్కాలర్‌షిప్‌ ఇవ్వడం లేదు. వైఎస్‌ఆర్‌ చనిపోయారని ఎవ్వరూ కూడా బాధపడొద్దు.. మనందరకి జగనన్న అండగా ఉన్నారు’’ అని ఆ యువతి పేర్కొంది.

మరిన్ని వార్తలు