నా దగ్గర డబ్బుల్లేవు, కూర్చోడానికి కుర్చీలేదు

16 Jul, 2014 14:30 IST|Sakshi
నా దగ్గర డబ్బుల్లేవు, కూర్చోడానికి కుర్చీలేదు

'నా దగ్గర డబ్బుల్లేవు, కూర్చోడానికి కుర్చీలేదు' ఈ మాటలు అన్నది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ చేస్తానన్న బాబు ఇప్పుడు మాత్రం ఏ పని చేయడానికి అయినా డబ్బులు చాలా ముఖ్యమని చెప్పుకు రావటం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ పంట రావాలంటే ఆరు నెలలు పడుతుందని... తన పరిస్థితి కూడా అంతే అని అన్నారు.

బెల్టు షాపులు లేకుండా సంతకం చేస్తామని, ఎక్కడైనా ఉంటే లేకుండా చూసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. బెల్టు షాపుల కారణంగా ఉపాధి కోల్పోయినవారికి రుణాలు మంజూరు చేస్తామని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దివాలా తీయించారని, అప్పులు మాత్రమే ఉన్నాయని, ఆదాయం మాత్రం లేదని చెప్పుకొచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు