అవగాహన ఉంది...  ఆచరణలో పెడతా..

6 Apr, 2019 15:36 IST|Sakshi
బడ్డుకొండ అప్పలనాయు డు

నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తిగా నిర్వీర్యం చేశారు

పథకాలు పూర్తిచేయడంలో విఫలమయ్యారు, వారి హయాంలో అవినీతి రాజ్యమేలింది

రాజన్న పట్టుదల జగనన్నలో చూశా...

సాక్షి ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూలో నెల్లిమర్ల వైఎస్పార్‌సీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు

పంచాయతీ సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు... జెడ్పీటీసీగా గెలిచారు. జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ స్థానాన్ని అధిరోహించారు. అటు తరువాత ఎమ్మెల్యేగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన యువనాయకుడతను. ఎవరు అధికారంలో ఉన్నా... లౌక్యంతో మెలిగారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. నాడు రాజన్న పాలన చూశారు. ఆయనలోని సంక్షేమ గుణాన్ని గుర్తించారు. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్న ఆయన తనయుడు జగనన్నను అనుసరిస్తున్నారు. ఆయనే బడ్డుకొండ అప్పలనాయు డు. నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయన సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

అలా మొదలైంది...
1989 నుంచి గ్రామ స్థాయి రాజకీయాల్లో మా అన్నయ్య జనార్దన్‌నాయుడు సర్పంచ్‌గా ఉండే వారు. అప్పటినుంచి యాక్టివ్‌గా రాజకీయాల్లో పాల్గొన్నాను. 1991లో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యా ను. గ్రామాల్లో మద్యపానం, పేకాట వంటివి కంట్రోల్‌ చేశాను. అక్కడినుంచి తిరిగి చూసుకోలే దు. వరుసగా మా కుటుంబంలోనివారే విజయం సాధిస్తూ వచ్చారు. తర్వాత జెడ్పీటీసీగా గెలిచా ను.  2006, ఫిబ్రవరి 5న జిల్లాపరిషత్‌ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశాను.

2009లో నెల్లిమర్ల నియోజకవర్గం ఏర్పడింది. చివరి నిమిషంలో మహానేత రాజశేఖరరెడ్డి నన్ను నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. ఆ పోటీలోనూ గెలిచాను. బొత్స సత్యనారాయణ నా వెనుక ఉండి నడిపించారు. దివంగత నేతను కోల్పోయాం. 2014లో నన్ను రమ్మని టీడీపీ వాళ్లు ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్‌ తరఫునే పోటీచేశా... అయినా 23,500 ఓట్లు పడ్డాయి.

జగనన్న బాటలో...

వైఎస్సార్‌సీపీలో చేరిన తరువాత మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేసిన ప్రతీ కార్యక్రమాన్నీ విజయవంతం చేశాను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింట ప్రచారం చేశాను. మాకు గ్రౌండ్‌ లెవెల్‌లో వర్క్‌ చేసే వాళ్లున్నారు. పెద్దలు బొత్స సత్యనారాయణ, సాంబశివరాజుల సహాయంతో ముందుకు నడుస్తున్నాను. నియోజకవర్గంలో ఏం చేయాలో అవగాహన ఉంది. గెలిపిస్తే అవన్నింటినీ ఆచరించి చూపిస్తా.

బాబు పథకాలన్నీ పచ్చనేతలకే...

చంద్రబాబు చెపుబుతున్న పసుపు, కుంకుమ పచ్చ నేతలకే అందుతున్నాయి. రైతు రథాలు నిజమైన రైతుకు ఇవ్వలేదు. వారి పార్టీలో ఉండి... ఎవరైతే కమీషన్లు ఇచ్చారో వారికే అందించారు. జన్మభూమి కమిటీ అనేది ఒక బ్రోకరు కమిటీ. ఒక దళారీ కమిటీ. చంద్రబాబు ఇచ్చే రూ.10వేలతో మహిళల పసుపు–కుంకుమలు చల్లగా ఉండవు. బెల్ట్‌ షాపులన్నీ తీసేస్తామని చెప్పారు. ఒక్కో గ్రామంలో 20 నుంచి 30 మద్యం బెల్ట్‌షాపులున్నాయి. ఈ ప్రభుత్వంలో నాలుగు మాసాల నుంచి ఉపాధి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ డబ్బునే బహుశా పసుపు కుంకుమగా అందిస్తున్నారేమో. వైఎస్‌ హయాంలో 108కి ఫోన్‌ చేసిన వెంటనే వచ్చేది. ఇప్పుడలా లేదు. ఇవన్నీ వారి వైఫల్యాలకు నిదర్శనాలే.

నియోజకవర్గంలో అవినీతి రాజ్యం

ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు కొడుకులు, మనవడు కలిసి మూడు తహసీల్దార్‌ కార్యాలయాలను పంచుకున్నారు. ప్రతీ దానికి ఒక రేటు పెట్టారు. ముఖ్యంగా పాత రోజుల్లో వేసిన లే అవుట్‌ల యాజమానులను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దోచుకో దాచుకో అన్న చందంగా వ్యవహరించారు. ఆ ఎమ్మెల్యే హయాంలో ఇటు పూసపాటిరేగకు, అటు భోగాపురానికి, ఇటు డెంకాడకు చెందకుండా ప్రభుత్వాస్పత్రిని నిర్మించారు. అది ఎవరికీ ఉపయోగం లేదు. నా హయాంలో ఏ గ్రామానికి ఏం చేశానో చెప్పగలను.

వీళ్లు చెప్పలేరు. ఇళ్లు కూడా ముఖాలు చూసి ఇచ్చారు. ఇక్కడి మత్స్యకార ప్రాంతాలున్నాయి. వారికి జెట్టీలు కావాలని అడుగుతున్నారు.  నేను వచ్చిన తరువాత అవన్నీ పూర్తి చేస్తాను. పరిశ్రమల వ్యర్థాలతో పడుతున్న అవస్థలను సైతం గట్టెక్కిస్తా. ఇక్కడివారు వలసలు వెళ్లకుండా నిరోధిస్తాను. ఇటీవలే జిల్లా మత్స్యకారులు ఇతర దేశాల జలాల్లోకి వెళ్లిపోయి అక్కడి వారి చెరలో చిక్కుతున్నారు. ప్రభుత్వంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణకు చెప్పడంతో విజయసాయిరెడ్డి ద్వారా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు.

మాటతప్పని నేత జగన్‌

జగన్‌మోహన్‌రెడ్డిలో చక్కనైన వ్యూహం ఉంది. ఏం చేస్తే ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందని ఆలోచిస్తారు. దానినే ఆచరిస్తారు. ఏ నాయకుడైనా పది మందికి ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టేది చేయకూడదు. జగన్‌ ఆలోచనలతో ఈ రాష్ట్రం పురోగమిస్తుందన్న నమ్మకం ఉంది. ఆయన మా ట తప్పరు.. మడమ తిప్పరు. ఏ సమస్య అయినా ఆయన వింటారు. ఎన్నో సర్వేలు చేసి నాకు సీటు ఇచ్చారు. ఆయన సూచనలతోనే కార్యక్రమాలు చేస్తాను. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను.

జగన్‌లో పట్టుదల ఉంది
జగన్‌మోహన్‌రెడ్డి చాలా పట్టుదలగల వ్యక్తి. ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు. తల్లిని, భార్యను కుటుంబాన్ని వదిలి 3648 కిలోమీటర్ల పాదయాత్ర ఎవరికీ సాధ్యం కాదు. రాజశేఖరరెడ్డిని నేను దగ్గరగా చూశాను. ఆయన లక్షణాలన్నీ జగన్‌లో ఉన్నాయి. ఏదీ ఆషామాషీగా చెప్పరు. అవగాహనతోనే ప్రకటిస్తా రు. ఎక్కడ పరిశ్రమలున్నాయో స్థానికంగా ఉన్న వారికి 75 శాతం మందికి ఉద్యోగాలు కల్పించాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో డిగ్రీలు పూర్తి చేసి ఖాళీగా ఉన్న వారందరికి ఉద్యోగాలు వస్తాయి.

ఈ ప్రాంతానికి అశోక్‌చేసిందేమీ లేదు

అశోక్‌గజపతిరాజు ఎంపీ అయితే జిల్లాకు పరిశ్రమలు తీసుకు వచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తాడనుకున్నాం. కానీ ఆయన ఆ మునిసిపాలిటీకి కూడా న్యాయం చేయలేదు. తన కోటకు మాత్రం కొత్త హంగులు సమకూర్చుకున్నారు. ఎంపీ ల్యాండ్స్‌ ఏం చేశారో తెలియదు. ఎయిర్‌ పోర్ట్‌ భూములు కోల్పోయిన వారికి ఈ రోజు వరకు నగదు అందలేదు. అడిగితే కేసులు బనాయిస్తున్నారు. రైతులకు రావాల్సిన డబ్బుల్లో కూడా కమీషన్లు లాక్కున్నారు. టీడీపీ ఏది చేసినా అవినీతే. నారాయణస్వామినాయుడుకు పదవీ వ్యామోహం ఉంది కాబట్టి వయో భారం వచ్చినా ఇంకా పోటీకి దిగారు.  

మరిన్ని వార్తలు