చంద్రబాబు పాలన బాగుంటుందనే...పవన్

6 Mar, 2015 11:36 IST|Sakshi
చంద్రబాబు పాలన బాగుంటుందనే...పవన్

చంద్రబాబు నాయుడుకు పరిపాలనా అనుభవం బాగుంటుందనే ఆయనకు మద్దతు ఇచ్చినట్లు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ  మహాత్మాగాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం కావాలని...  అయితే అభివృద్ధి పేరుతో గ్రామాలను చంపేయవద్దని  అన్నారు.  ఆయన తన ప్రసంగంలో '90 శాతంమంది రైతుల స్వచ్ఛందంగా ఇచ్చారని మంత్రులు చెప్పారు. సింగపూర్ లాంటి రాజధానిని కట్టాలనుకోవడం మంచి విషయమే. అయితే రైతుల నుంచి భూ సేకరణ చేసేటప్పుడు ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించాలి. ఇది అధికారం కోసం చేస్తున్న పోరాటం కాదు..ప్రజల నిజమైన సమస్యల కోసం. తిరిగి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు సరిపోవడం లేదని అక్కడ ఉండవల్లి రైతులు నాతో అన్నారు.

మూడు పంటలు పండే భూములు ఇవ్వమని పెనుమాక గ్రామస్తుతు తెలిపారు. బహుళ పంటలు పండే భూముల సేకరణకు అప్పట్లో రాజ్నాథ్ సింగ్ వ్యతిరేకించారు. ఇప్పటికీ ప్రభుత్వానికి మూడుసార్లు భమూలు ఇచ్చామని బేతపూడి గ్రామాస్తులు చెప్పారు. నేను పోరాటం చేస్తే అభివృద్ధి నిరోధకుడని నన్ను జైల్లో పెడతారు. భూములు ఇచ్చిన తర్వాత గ్యారెంటీ ఎలా ఉంటుందని తుళ్లూరు రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్పై అక్కడి రైతులు ఆందోళన  చెందుతున్నారు. గతంలో హైదరాబాద్ సేకరించిన భూమిలో చాలా భూమి ఇంకా ఖాళీ ఉంది. 32 వేల ఎకరాలు సేకరిస్తే ఎప్పటికి అభివృద్ధి చెందుతుంది' అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు