బాసటగా ఉంటాం కలెక్టర్ సిద్ధార్థజైన్

2 Nov, 2013 05:50 IST|Sakshi

 ఏలూరు, న్యూస్‌లై న్ : జిల్లా రైతులకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ స్ఫూర్తితో జిల్లా సమగ్రాభివృద్ధికి, పేదలను ఆదుకునే సంక్షేమ పథకాల అమలులో ముందడుగు వేసేందుకు జిల్లా యంత్రాంగం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్, పంట రుణాలు, సాగునీటి సరఫరా, పంటలకు మద్దతు ధర వంటి అంశాల్లో రైతులకు జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.3,114 కోట్లను పంట రుణాలుగా అందించామని చెప్పారు. 1.24 లక్షల మంది కౌలు రైతులకు రుణార్హత కార్డులను అందించామన్నారు.
 
  ఈ ఏడాది 54వేల మంది కౌలుదారులకు రూ.132 కోట్లను రుణాలు ఇచ్చామని చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బ తీశాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1 లక్షా 47 వేల 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టపోరుున రైతులందరినీ ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందించేందుకు 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.
 
 డెల్టా ఆధునికీకరణకు రూ.1,464 కోట్లు : సాగునీరు సక్రమంగా పంపిణీ అయ్యేందుకు, లోతట్టు ప్రాంతాలను ముంపు బారినుంచి కాపాడేందుకు రూ.1,464 కోట్లతో చేపట్టిన డెల్టా ఆధునికీకరణ పనులను వేగవంతం చేస్తామని సిద్ధార్థజైన్ చెప్పారు. కొల్లేరు ప్రాంతాన్ని ముంపునుంచి రక్షించేందుకు రూ.12కోట్లతో ఇన్‌ఫాలింగ్ డ్రెయిన్లు, రూ.81 కోట్లతో యనమదుర్రు డ్రెయిన్, రూ.87 కోట్లతో ఎర్రకాల్వ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు, మాతా శిశు మరణాలను మరింతగా తగ్గించేందుకు, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్న సంకల్పంతో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద జిల్లాలో 75 వేల కుటుంబాలకు వాటిని నిర్మించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.75 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు.
 
  పాల ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర కృషి వికాస యోజన, పశుక్రాంతి పథకాల కింద రూ.77 లక్షల సబ్సిడీతో 250 పాడి పశువులను అందించినట్టు చెప్పారు. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్న దృష్ట్యా విద్యార్థులు మంచి మార్కులతో నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ ఎం .రమేష్, డీఆర్వో కె.ప్రభాకరరావు, విజిలెన్స్ ఎస్పీ ఎం.నారాయణ, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు బి.చ ంద్రారెడ్డి, ఆర్డీవోలు బి.శ్రీనివాస్, గోవిందరావు, డీపీవో అల్లూరి నాగరాజు వర్మ, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, తహసిల్దార్ ఏజీ చిన్నికృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్, డీఎస్‌వో డి.శివశంకర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ కె.శ్రీనివాస్ శర్మ, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ కె.వేణుగోపాల్, డీఈవో నరసిం హరావు, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ కె.జ్ఞానేశ్వరరావు, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, హౌసిం గ్ పీడీ జి.సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు, మెప్మా పీడీ వీవీ శేషారెడ్డి, సెట్వెల్ సీఈవో ఎండీహెచ్ మెహర్రాజ్ పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు