చంద్రబాబుపై ఐఏఎస్‌ల ఆగ్రహం

13 Apr, 2019 03:05 IST|Sakshi

సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహ నిందితుడు ఎలా అవుతారు? 

హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చిన తర్వాత కూడా నిందితుడని అంటారా?

ఏపీ సీఎంపై మండిపడుతున్న ఐఏఎస్‌ అధికారులు

గవర్నర్‌కు ఫిర్యాదు చేసే యోచన 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోవర్టు అని, సహ నిందితుడు అని ఏపీ సీఎం  చంద్రబాబు వ్యాఖ్యానించడంపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఎల్వీ సుబ్ర హ్మణ్యంను సహనిందితుడు అని ఎలా సంబోధిస్తారని నిలదీస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న సీఎస్‌ను కోవర్టు అని ముఖ్య టమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా అం టారు? ఇదేనా ఆయన చెప్పుకునే 40 ఏళ్ల అను భవం. రాజకీయంగా ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు. దాంతో అధికారులకు సంబంధం లేదు. కానీ, రాష్ట్ర అత్యున్నత అధికారిని కోవర్టు అని ముఖ్యమంత్రి అన్నాడంటే ఇంగిత జ్ఞానం కోల్పోవడమే’’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నిలదీస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై ఏపీ ఐఏఎస్‌ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎస్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయాలని ఐఏఎస్‌ అధికారుల సంఘం భావి స్తోంది. ఎల్వీ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చర్యలు తీసుకో వాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని అసోసి యేషన్‌ యోచిస్తోంది. త్వరలో అసోసియేషన్‌ సమా వేశమై ఈ మేరకు తీర్మానం చేసి గవర్నర్‌కు సమర్పి ంచాలని భావిస్తున్నట్లు కొందరు ఐఏఎస్‌ అధికారులు తెలిపారు. 

ప్రజలను తప్పుదోవ పట్టించడమే..
ఎల్వీ సుబ్మహ్మణ్యంపై సీబీఐ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఆయనను నిందితుడు అనడం తీవ్ర తప్పిదమని ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ‘‘హైకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన తర్వాత ఎవరూ నింది తుడు అనడానికి వీలులేదు. సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే. అబద్ధాలు చెప్పి నిందారోపణలు చేయడం తగదు. అసాధారణ పరి స్థితుల్లో పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు వెళ్లి సమీక్షిం చడమనేది సీఎస్‌ బాధ్యతల్లో ఒకటి. బాధ్యతను ఆయన సక్రమంగా నిర్వర్తించారే తప్ప  ఎలాంటి తప్పులేదు ’’ అని స్పష్టం చేశారు. 

చంద్రబాబు చెప్పినట్లు తొత్తుల్లా పనిచేయకుండా నిరాకరించే వారంతా ఆయన దృష్టిలో కోవర్టులా? అని రిటైర్డు ఐజీ ఎ. సుందర్‌ కుమార్‌ దాస్‌ ప్రశ్నిం చారు. ‘‘ఆయన కంటే కోవర్టులను పెట్టుకునేవారు దేశంలో ఎవ రైనా ఉన్నారా? ఎల్వీ సుబ్రహ్మ ణ్యంను పక్కన పెట్టి జూని యరైన పునేఠాను సీఎస్‌గా ఎందుకు పెట్టా రు? తాను చెప్పి నట్టల్లా ఆడు తూ ఫైల్‌లో ఎక్క డ పెట్ట మంటే అ క్కడ సంతకం పె ట్టే వారే బాబు దృ ష్టిలో నిజాయతీపరు లైన అధి కారులా?’’ అని నిలదీశారు.

మరిన్ని వార్తలు