‘సీఏ’ పరీక్షలు వాయిదా  

28 Mar, 2020 11:34 IST|Sakshi

మేలో జరగాల్సిన పరీక్షలను జూన్, జూలైకి రీ–షెడ్యూల్‌  

సాక్షి, గుంటూరు: కరోనా వైరస్‌ కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో మేలో జరగాల్సిన సీఏ కోర్సులకు సంబంధించిన వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి. మే 2వ తేదీ నుంచి 18 వరకూ జరగాల్సిన పరీక్షలను రీ–షెడ్యూల్‌ చేస్తున్నట్టు న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) శుక్రవారం ప్రకటించింది.  

న్యూఢిల్లీలోని ఐసీఏఐ ప్రకటించిన రీ–షెడ్యూల్‌ తేదీలు.. 

  • జూన్‌ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో సీఏ ఫౌండేషన్‌ కోర్సులో పాత విధానం ప్రకారం పరీక్షలు జరగనున్నాయి. 
  • ఇంటర్మీడియెట్‌ (ఐపీసీ) కోర్సు పాత విధానాన్ని అనుసరించి గ్రూప్‌–1 విభాగంలో జూన్‌ 20, 22, 24, 26వ తేదీల్లోనూ, గ్రూప్‌–2 విభాగంలో జూన్‌ 28, 30, జూలై 2వ తేదీల్లో జరగనున్నాయి.  
  • కొత్త విధానాన్ని అనుసరించి గ్రూప్‌–1 విభాగంలో జూన్‌ 20, 22, 24, 26వ తేదీలు, గ్రూప్‌–2 విభాగంలో జూన్‌ 28, 30, జూలై 2వ, 4వ తేదీల్లో జరగనున్నాయి.  
  •  సీఏ–ఫైనల్‌ కోర్సు పరీక్షలు పాత విధానం.. గ్రూప్‌–1 విభాగంలో జూన్‌ 19, 21, 23, 25వ తేదీల్లోనూ, గ్రూప్‌–2 విభాగంలో జూన్‌ 27, 30, జూలై 2వ, 4వ తేదీల్లో జరగనున్నాయి. 
  • సీఏ–ఫైనల్‌ కొత్త విధానంలో పరీక్షలు గ్రూప్‌–1 విభాగంలో జూన్‌ 19, 21, 23, 25 తేదీల్లో, గ్రూప్‌–2 విభాగ పరీక్షలు జూన్‌ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో జరగనున్నాయి.  
  • ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లా అండ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ పార్ట్‌–1 పరీక్షలు గ్రూప్‌–ఏ విభాగంలో జూన్‌ 20, 22, గ్రూప్‌–బి విభాగంలో జూన్‌ 24, 26వ తేదీల్లో జరగనున్నాయి.  
  • ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌ – అసెస్‌మెంట్‌ టెస్ట్‌ పరీక్ష జూన్‌ 27, 29వ తేదీల్లో జరుగుతాయి.  
  • దేశ వ్యాప్తంగా 207 ప్రధాన నగరాలు, పట్టణాల్లో జరగనున్న సీఏ పరీక్షలకు దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు.  
మరిన్ని వార్తలు