ఓటర్‌ స్లిప్‌తో ఓటు వేయడం కుదరదు

9 Apr, 2019 11:53 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న, చిత్రంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : ఓటర్‌ స్లిప్‌లు, రేషన్‌కార్డులతో ఓటు వేయాలనుకుంటే కుదరదని, ఓటర్‌ ఎపిక్‌ కార్డు లేదా ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన 13 గు ర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటేనే ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశముంటుందని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న అన్నారు. సో మవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఎన్నికలకు 95 శాతం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో అందరికీ  ఓటర్‌ స్లిప్పులు సరఫరా చేసినట్లు తెలిపారు. 10,11 తేదీల్లో ఎ న్నికల అభ్యర్థులు వినియోగించే వాహనాలకు సంబంధించి ముందస్తుగా తన వద్ద ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. 10, 11 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు చెప్పారు. అభ్యర్థులపై క్రి మినల్‌ కేసులుంటే తప్పకుండా ప్రకటనలివ్వాలని కోరారు. 2,800 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. ఏజెంట్లు ఎలాంటి ప్రచారాలు చేయకూడదని, పార్టీ కండువాలతో రాకూడదని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్దకు బయట వ్యక్తులను అనుమతించరని తెలిపారు.  పెయిడ్‌ న్యూస్‌ కింద ఇప్పటివరకు 57 కేసులు, 337 మో డల్‌ కోడ్‌ అతి క్రమణ కేసులు నమోదు చేశామన్నారు.

6 గంటల వరకే ప్రచారం
అభ్యర్థులు మంగళవారం సాయంత్రం 6 గం టల వరకే ప్రచారం చేసుకునే అవకాశముంటుందని  ప్రద్యుమ్న అన్నారు.   ఈ నెల 9న సాయంత్రం 6 నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. 9 నుంచి 12 వరకు మద్యం షాపులు తెరవకూడదని చెప్పారు. జిల్లాలోని 525 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్, వీడియోకవరేజీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి 9 వేల మంది పోలీసులు

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ఇతర రాష్ట్రాల నుంచి 9 వేల మంది పోలీసులను ఈసీ పంపిందన్నారు. 10, 11 తేదీల్లో 5 మంది కంటే ఎక్కువగా ఎవరైనా కనిపిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వద్దకు రవాణా చేస్తే కేసులు పెడతామని తెలిపారు.  ఎవరైనా తెరిస్తే  సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 20,500 మందిని బైండోవర్‌ చేశామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు