నిర్లక్ష్యం చేస్తే.. ప్రత్యేక రాయలసీమ ఉద్యమమే

3 Jul, 2015 04:36 IST|Sakshi
నిర్లక్ష్యం చేస్తే.. ప్రత్యేక రాయలసీమ ఉద్యమమే

రాయలసీమ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం నడపాల్సి ఉంటుందని ప్రజా సంఘాలు హెచ్చరించాయి.  తిరుపతిలో గురువారం ఏపీ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు నేతలు, వక్తలు ప్రసంగించారు.
 
- ‘విభజన’ ఉద్యమంలో టీడీపీ నేతలే లేరు
- ఉమ్మడి రాజధానిలో వాటా ఇవ్వాలి
- జర్నలిస్ట్ ఫోరం చర్చాగోష్టిలో వక్తలు
తిరుపతి అర్బన్:
రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత కూడా రాయలసీమ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే మరో పదిహేనేళ్లలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం నడపాల్సి ఉంటుందని రాయలసీమ అధ్యయనాల సమితి అధ్యక్షుడు భూమన్ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 అ మలు, ప్రత్యేక హోదా, రాయలసీమ సమగ్రాభివృద్ధి అనే అం శాలపై ఏపీ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి జిల్లాలోని ప లువురు రాజకీయ నేతలు, రైతు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు రాష్ట్రస్థాయి నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భూమన్ మాట్లాడుతూ రాయల సీమ జిల్లాలకు నీటి వనరులను సమృద్ధిగా అం దిస్తే తప్ప ప్రజలు తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చలేరన్నారు. అలాగే నాలుగు జిల్లాల్లో లభ్యమయ్యే ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా సీమ ప్రాంత అభివృద్ధికే కేటాయిం చాలన్నారు. శ్రీకృష్ణ కమిటీలోని ప్రధాన అంశాలో ్లనూ రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక ఉద్యమం వస్తుందన్నారు.  
 
నష్టపోతామని చెప్పినా వినలేదు
ఉమ్మడి రాష్ట్రం విడిపోతే నష్టపోతామని చెప్పినా పార్టీలు, స్వార్థపరులు వినలేదు. ఇప్పటికీ అన్ని రంగాల్లో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. కేంద్రం స్పం దించి నవ్యాంధ్రకు నిధులు ఇవ్వా లి. సెక్షన్ 8పై కఠినంగా వ్యవహరించి, గవర్నర్ సమస్యలు పరిష్కరించాలి.
 -డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు,

డాక్టర్స్ జేఏసీ నేత ఉద్యమంలో టీడీపీ నేతలే లేరు
సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ నేతలు ఎక్కడా కనిపించలేదు. అస లు సెక్షన్ 8పై ఇంత రాద్ధాం తం చేయడం కన్నా ఆ సెక్షన్‌లోనే సవరణలు చేయాలి. మన ప్రభు త్వ శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శినే తెలంగాణ వాళ్లు లోపలికి రానీలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో...? హైదరాబాద్‌లో పరి స్థితులు చూస్తుంటే మరోసారి ఉద్యమించాల్సిన అవసరం కలుగుతోంది.       
-నిర్మల, యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు
 
కేంద్రం తప్పక న్యాయం చేస్తుంది
నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్రం తప్ప క సహకరించి, న్యాయం చేస్తుంది. ఒకప్పుడు అన్నపూర్ణాంధ్రగా ఉన్న మన రాష్ట్రాన్ని ఇప్పుడు అంధకారాంధ్రగా మార్చారు. కేసీఆర్ ధోరణి మారాలి. రాజధాని నిర్మాణానికి డీటైల్డ్ రిపోర్డు ఇవ్వకుండానే కేం ద్రం నిధులు ఇవ్వడం లేదంటే ఎట్లా? విభజన చట్టంలోని పాత, కొత్త గైడ్‌లైన్స్‌ను పరిశీలించి నిర్ణయించాల్సి వుంది.
 - గుడిపల్లి భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత
 
గవర్నర్ జోక్యం ఉండాలి
హైదరాబాద్‌లో సీమాంధ్రులకు న్యాయం జరిగి భద్రతకు భరోసా రావాలంటే గవర్నర్ జోక్యం చేసుకోవాలి. ఆ దిశగా ఆయన రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా చూడాలి.
- తలారి ఆదిత్య,
 
సత్యవేడు ఎమ్మెల్యే
రైతు సమస్యలు పేరుకుపోతున్నాయి

విభజన తర్వాత రైతు లు, వారికి సంబంధించిన శాఖల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. రైతులు పం డించే పంటలకు వారే ధరలు నిర్ణయించే వాతావరణం కల్పిం చాలి. అంతేగాక నవ్యాంధ్రలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
- మాంగాటి గోపాల్‌రెడ్డి, రైతు సంఘంనేత

ఉమ్మడి రాజధానిలో వాటా ఇవ్వాలి
నవ్యాంధ్రకు ఉమ్మడి రాజధాని హైదరాబా ద్ ఆదాయంలో వా టా ఇవ్వాలి. ఆంధ్రులపై తెలంగాణ వాదు లు దాడులు చేస్తే అక్క డ కేసులు నమోదు కావు. విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు కాదంటే విభజన జరగనట్టే.                 

రాష్ట్ర కార్యదర్శి, ఏపీ ఎన్జీవోల సంఘం
రెండు కౌన్సిళ్లను సంప్రదించాలి

సెక్షన్ 8తో పాటు విభజన చట్టంలోని అంశాలపై రెండు కౌన్సిళ్లను కేంద్రం సంప్రదించి న్యాయం చేయాలి. ఈ అంశంపై మేధావులు కూడా ఉద్యమించాలి. దీన్ని రాజకీయ కో ణంగా చూడకుండా రాష్ట్ర అంశంగా పరిగణించాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం.
 - జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెలీ
 
సమగ్ర సర్వే పేరుతో మోసం
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే పేరుతో ఆం ధ్రులను తరిమే ప్రయత్నాలు చేసింది. అంతేగాక తెలంగాణ నియంతృత్వ పోకడలతో డెప్యూ టీ కలెక్టర్లు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం, గవర్నర్ చొరవ తీసుకుని సీమాంధ్రులకు రక్షణ కల్పించాలి.
 - బొప్పరాజు వెంకటేశ్వవర్లు,
 రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

 
విద్యారంగం అభివృద్ధికీ ఆటంకమే..
రాష్ట్ర విభజనతో విద్యా రంగాభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు అవస్థ లు పడుతున్నారు. ప్రొఫెసర్లకు కూడా భద్రత లేకుండా తిరగాల్సి వస్తోంది. రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలి.
- ప్రొఫెసర్ కృష్ణమోహన్,
ఎస్వీ యూనివర్సిటీ

 
రాజకీయాలకు తావు ఇవ్వవద్దు
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎదురవుతున్న సెక్షన్ 8 సమస్యను పరిష్కరించేందుకు జర్నలిస్టుల ఫోరం నిర్వహిస్తున్న ఇలాంటి స దస్సుల్లో రాజకీయాల కు తావు లేదు. అన్ని వర్గా లు కలిసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించడమేకాకుండా మీడియా ను నియంత్రించాలంటే ఆయనకే ఇబ్బందులు.                             
- కృష్ణాంజనేయులు, జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు

మరిన్ని వార్తలు