'పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వస్తే స్వాగతిస్తాం'

22 Oct, 2013 14:03 IST|Sakshi
'పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వస్తే స్వాగతిస్తాం'

హైదరాబాద్: అవినీతి పరులు తప్ప మంచి వ్యక్తులు ఎవరైనా తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంచి వ్యక్తులు ప్రజాజీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచివాడనే పేరుందని తెలిపారు. పది మందికి సాయం చేసే గుణం ఉందని విన్నట్టు చెప్పారు. టీడీపీలోకి దారి ఉందో, లేదో పవన్ కళ్యాణ్నే అడగాలని అన్నారు.

పవన్ కళ్యాణ్, నాగబాబు టీడీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు కూడా అన్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పోరాడేందుకు టీడీపీ సరైన వేదిక అని పేర్కొన్నారు. మెగా బ్రదర్స్‌తో బాలకృష్ణ చర్చల విషయంపై తనకు సమాచారం లేదని చెప్పారు. త్వరలో టీడీపీలోకి కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వస్తారని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు