కదిలే రైలులో మెదిలే ఊహలెన్నో!  

20 Jul, 2019 13:34 IST|Sakshi

సాక్షి, కర్నూలు: రైలు ప్రయాణం చాలా మందికి సుపరిచితమే. అందులో అనుభూతులు మాత్రం కొందరికే. కౌంటర్‌లో టికెట్‌ తీసుకోవడంతో మొదలయ్యే జర్నీలో ప్రతి అంశాన్ని మనసుతో ఆస్వాదిస్తే మరచిపోలేని జ్ఞాపకాలెన్నో. అనౌన్స్‌మెంట్‌తో పాటు రైలు కూత వినడం.. పట్టాల మీద రైలు రాక చూడటం.. కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య సీటు పట్టుకోవడం, అది కిటికీ పక్కనే అయితే అంతులేని సంతోషం. ఎదురుగా ఆప్యాయంగా పలకరించే ప్రయాణికులు.. వారి మధ్య కబుర్లు.. చాయ్, సమోసా, పల్లీలు..అంటూ వ్యాపారుల అరుపులు, భిక్షాటకుల జానపద గేయాలు.. క్రాసింగ్‌  కోసం నిలిచే స్టేషన్‌లో కళ్ల ముందు దూసుకెళ్లే రైలు.. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి వెనకు వెళ్లే చెట్లు.. ఆహ్లాదంగా కనిపించే పచ్చని పైర్లు.. నది వంతెన పైనుంచి కిందకు చూస్తే ప్రవహించే జల పరవళ్లు.. రైలు ప్రయాణంలో కమనీయ దృశ్యాలెన్నో.  ప్రకృతిని ఆస్వాదించాంటే రైలు ఒక్కసారైనా ఎక్కాల్సిందే.  కర్నూలు సమీపంలోని తుంగభద్ర నది వంతెన మీదుగా  రైలు కర్నూలు స్టేషన్‌ వైపు చేరుకుంటున్న తరుణంలో కనిపించిన అందమైన దృశ్యం ఇది. 
               

మరిన్ని వార్తలు