రైతుల ముసుగులో దాడులకు పాల్పడ్డారు

27 Dec, 2019 18:01 IST|Sakshi

సాక్షి, అమరావతి : వెలగపూడిలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఐజి వినీత్‌ బ్రిజల్‌ పేర్కొన్నారు. రైతుల ముసుగులో కొంతమంది బయటి వ్యక్తులు వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. కాగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో  ఉన్నట్లు ఐజి స్పష్టం చేశారు.  మీడియా వాహనాన్ని ధ్వంసం చేయడమనేది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో ఒక మహిళా రిపోర్టర్‌తో పాటు పలువురు జర్నలిస్ట్‌లు గాయపడినట్లు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే బయటవ్యక్తులు వచ్చి దాడులకు రెచ్చగొట్టారని , దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే రైతుల ముసుగులో కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై కూడా దాడికి దిగారని, ఆ సమయంలో పోలీసులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు.. 

అందుకే చంద్రబాబు బాధపడుతున్నాడు : అంబటి

కంటైన్మెంట్‌ జోన్లలో కొనసాగుతున్న ఆంక్షలు..

ఏపీలో మొత్తం 133 రెడ్‌ జోన్లు

కత్తిపూడిలో హై అలర్ట్‌..

సినిమా

పాడినందుకు పైసా ఇవ్వ‌రు: ప్ర‌ముఖ‌ సింగ‌ర్‌

రష్మిక అంటే క్రష్‌ అంటున్న హీరో..

నిజంగానే గ‌డ్డి తిన్న స‌ల్మాన్‌

ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు

'శ్రియా.. ప్లీజ్‌ అతన్ని ఇబ్బంది పెట్టకు'

‘నా భర్త దగ్గర ఆ రహస్యం దాచాను’