ఐఐటీలో మెరిసిన తెలుగు తేజం

31 Jul, 2014 02:14 IST|Sakshi
ఐఐటీలో మెరిసిన తెలుగు తేజం

హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మక  ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో తెలుగు తేజం మెరిసింది. గుడివాడలో పాఠశాల విద్య పూర్తిచేసుకున్న పి.రోహిత్ ఏకంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్(ఈ అండ్ ఈసీఈ) టాపర్‌గా నిలిచాడు. బీటెక్‌లో 9.28/10 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ) సాధించి ప్రతిభ చాటిన రోహిత్ ఇన్‌స్టిట్యూట్ సిల్వర్ మెడల్‌తోపాటు ఎండోమెంట్ ప్రైజ్‌ను జూలై 26న అందుకున్నాడు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్‌ఏంజెలిస్‌లో ఉచితంగా పీహెచ్‌డీ చేసేందుకు ఫెలోషిప్ అవార్డును, జార్జియాటెక్, మిచిగన్ , యాన్ అర్బోర్, పుర్‌డ్యూ యూనివర్సిటీలలో ప్రవేశ అవకాశాలూ దక్కించుకున్నాడు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఈ-బే/పేపాల్ సంస్థలో రూ.21.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.
 
 
 

>
మరిన్ని వార్తలు