ఇక నేవీ సంరంభం

9 Nov, 2013 02:33 IST|Sakshi

 

=రేపట్నుంచి వేడుకలు ప్రారంభం
 =నెల రోజులపాటు కార్యక్రమాలు, 4న నేవీడే
 =నౌకాదళం సర్వ సన్నద్ధం

 
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తూర్పు నౌకాదళ సంబరాలకు ఏటా మాదిరిగా విశాఖ వేదిక కానుం ది. ఈ నెల పదో తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలు డిసెంబర్ 4న నేవీ డేతో ముగియనున్నాయి. సెలెం ట్ సర్వీస్ పేరిట నౌకాదళ సత్తాను చాటే విన్యాసాలకు సాగరతీరం మరోమారు స్వాగతం పలకనుంది. ఈస్ట్రన్ ఫ్లీట్ యుద్ధ నౌకలు తూర్పుతీరం వెంట కొలువుతీరి కనువిందు చేయనున్నాయి. నౌకాదళ సేవలకు అద్దం పట్టే నేవీ మేళా ప్రత్యేక ఆకర్షణ కానుంది. నెలరోజుల పాటు సంబ రంగా సాగే వివిధ కార్యక్రమాలకు ఆదివారం తెరలేవనుంది.

ఏటా చిన్నారుల చిత్ర లేఖనంతో  ప్రారంభించడం ఆనవాయితీ. చిన్నారులతో పా టు ప్రత్యేక బాలలకు సయితం వేరే కే టగిరీలో పోటీలు నిర్వహిస్తారు. వీరు యుద్ధ నౌకల్లో ఎక్కి సాహస విన్యాసాల్ని  వీక్షించేందుకుఅనుమతిస్తున్నారు. పోర్ట్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల పదో తేదీన చిత్ర లేఖనం పోటీలు జరుగుతాయి. ప్రేమ సమాజంలో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. వినసొంపైనా నేవీ బ్యాండ్ వుడా పార్కులో 17న సంగీతాభిమానుల్ని ఓలలాడించనుంది. డే ఎట్ సీ పేరిట ఈ నెల 20న విన్యాసాల్ని ని ర్వహించనున్నారు.

విద్యార్థులకు ఈ నెల 19, 20 తేదీల్లోనూ, ప్రత్యేక బా లలకు 22న, ప్రజల కోసం 23, 24 తేదీల్లో యుద్ధ నౌకల్ని డాక్‌లో బెర్తుల వద్దకే తీసుకురానున్నారు. ఆర్కే బీచ్ లో డిసెంబర్ 4న అకాశంలో డోర్నియర్లు, ఫైటర్లు విన్యాసాలు చేస్తుం డగా సాగరం నుంచి నేలపైకి వచ్చి శత్రు శిబిరాల్ని తుదముట్టించడం, జలాంతర్గామి ఒక్కసారిగా సముద్రంలో పైకి లేవడం, నౌకల నుంచే యుద్ధ విమానాలపై దాడిలాంటి విన్యాసాలతో విస్మయపరిచే ఆపరేషన్స్‌తో వేడుకలకు ముగింపు పలికేందుకు నేవీ సర్వసన్నద్ధమైంది.
 

మరిన్ని వార్తలు