ఐకేపీ ఏపీఎం తొలగింపు

8 Jun, 2014 03:07 IST|Sakshi

సీతంపేట, న్యూస్‌లైన్: నిధుల దుర్వినియోగం ఆరోపణలు రుజువు కావడంతో ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) ఏపీఎంను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐటీడీ ఏ పరిధిలో మందస మండల ఏపీఎంగా పని చేస్తున్న తురక పార్వతిని విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో బి.రాజశేఖర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కొత్తూరు మండలం దిమిలిలో పనిచేసిన పార్వతి అక్కడ సుమారు రూ.2 లక్షల మేరకు ఆరోగ్య పోషకాహర నిధులు దుర్వినియోగం చేసినట్టు విచారణలో తేలడంతో ఆమెపై వేటు వేశారు. ఈ విషయాన్ని సీతంపేట టీపీఎంయూ విభాగం ఇన్‌చార్జి ఏరియా కోఆర్డినేటర్ జమాన శ్రీనివాసరావు ధ్రువీకరించారు. దిమిలిలో పని చేస్తున్నప్పుడు పార్వతి అక్కడి మండల మహిళా సమాఖ్యకు చెందిన  రూ.2.50 లక్షల వర కు ఆరోగ్య పోషకాహార  నిధులు స్వాహాకు పా ల్పడినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి.
 
 వీటిపై అప్పటి ఐటీడీఏ పీవో సునీల్‌రాజ్‌కుమార్ విచారణకు ఆదేశిస్తూ, ఆమెను సస్పెండ్ చేశా రు. విచారణ అనంతరం సస్పెన్షన్‌ను ఎత్తివేశా రు. అప్పట్లోనే ఆమెను కొత్తూరు నుంచి మందసకు, మందసలో పనిచేస్తున్న జగదీష్‌ను కొత్తూరుకు బదిలీ చేశారు. అనంతరం స్వాహా చేసిన నిధుల్లో సు మారు రూ.50 వేల వరకు ఎం ఎంఎస్‌కు జమచేసిన పార్వతి, మిగతా రూ.2 లక్షల నిధులు మాత్రం కట్టలేదు. కాగా నిబంధనల ప్రకారం ఏపీఎంలపై చర్యలు తీసుకునే అధికారం సెర్ప్ సీఈవోకు మాత్రమే ఉంది. అయితే ఐటీడీఏ పీవో నేరుగా జోక్యం చేసుకోవడంతో ఏమీ చే యలేక సెర్ప్ అధికారులు మిన్నకుండిపోయా రు. కొద్ది రోజుల తర్వాత సెర్ప్ అధికారులే రం గంలోకి దిగి విచారణ చేయించి, నిధు లు స్వా హా నిజమేనని తేలడంతో  పార్వతిని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు పంపించినట్టు ఇన్‌చార్జి ఏసీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు