లైసెన్స్ లేని బాణాసంచా దుకాణం సీజ్

5 Nov, 2015 19:10 IST|Sakshi

మాచర్ల టౌన్ (గుంటూరు) : అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న దీపావళి బాణాసంచా దుకాణాన్ని పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని సాగర్ రోడ్డులో సాయివిజయలక్ష్మి క్రాకర్స్ షాపు ఉంది. ఈ దుకాణం యజమాని గత ఏడాది పొందిన లెసైన్సును ఈ ఏడాది రెన్యువల్ చేయకుండానే విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అర్బన్ సీఐ సత్యకైలాస్‌నాథ్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సాయంత్రం దాడులు జరిపి రూ.1.50 లక్షల విలువైన బాణాసంచాను స్వాధీనం చేసుకుని, దుకాణాన్ని సీజ్ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా