నిద్రపోతున్న నిఘా నేత్రాలు..!

22 Jul, 2019 09:14 IST|Sakshi
మండల కేంద్రం మీదుగా అక్రమంగా తరలిపోతున్న కలప

విచ్చలవిడిగా ఇసుక రవాణా

అక్రమంగా కోతకు గురవుతున్న వృక్షాలు

వాల్టా చట్టానికి తూట్లు

సాక్షి, లక్కవరపుకోట (శ్రీకాకుళం): అధికారుల నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. ఇసుక, కలప అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ప్రభుత్వ పాలనలో ప్రక్షాలన తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కృషిచేస్తోంది. అయితే, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో ఇష్టారాజ్యంగా వృక్షాలను నరికివేసి తరలించుకుపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. పగలు, రాత్రీ తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడాన్ని జనం తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో మండలంలోని పలు గెడ్డలు, వాగుల్లోని ఇసుకను తవ్వి ట్రాక్టర్లు, లారీల సాయంతో తరలించుకుపోతున్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా ఒకటి రెండు వాహనాలపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

పెద్దపెద్ద వృక్షాలను అడ్డంగా నరికేస్తున్నారు. మండలంలోని ఐదు కర్రల మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల వద్ద వివిధ  రకాలకు చెందిన వందలాది మానులు నెట్టువేసి ఉన్నాయి. అటవీశాఖ వారు ఈ అక్రమ కలప దందాపై కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. చెట్ల నరికివేతకు ఇటీవల కాలంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇంత కలప ఎలా రవాణా అవుతుందో ఆర్ధం కావడం లేదని పలువురు బహిరంగానే చెబుతున్నారు. నిఘా నేత్రాలు నొట్టబోయే సరికి అక్రమ రవాణా దారులు దందాలకు తెగబడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అక్రమ రవాణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గోవిందా.. వసూళ్ల దందా!

అత్యవసరమా.. అయితే రావొద్దు!

రేపు జిల్లాకు కొత్త గవర్నర్‌ రాక

రవాణా శాఖ యూనిట్లలో డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు

లేని వారికి బొట్టు పెట్టి..

మా దారి.. రహదారి!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

బడి ముందు గుడి నిర్మాణం

ప్రేమను బతికిద్దామా! చావును ప్రేమిద్దామా?

మంచి రోజులొచ్చాయి

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాలింత మృతి

సహకార రంగానికి ఊతం

హజ్‌యాత్ర విమాన షెడ్యూల్‌ ఖరారు

వేగంగా ఏసీబీ కేసుల దర్యాప్తు

పెరుగుతున్న పట్నవాసం

రుణం వద్దన్నది భారత ప్రభుత్వమే

ఉద్యోగాంధ్ర

అంతరిక్ష యవనికపై జాబిల్లికి జైత్రయాత్ర!

‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీకి సాయంపై వరల్డ్‌ బ్యాంక్‌ స్పష్టత

విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్‌

‘గోదావరి జిల్లా వాసుల కల నిజం చేస్తా’

‘అన్యాయం జరిగితే నన్ను కలవండి’

నిండు గర్బిణిని డోలీలో తీసుకెళ్లారు!

నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి

‘అర్చకులు బాగుంటేనే ఆలయాలు బాగుంటాయి’

అవినీతి అంతా బయటకు తీస్తాం: చీఫ్‌ విప్‌

సెంట్రల్‌ జైలులో మృత్యుఘోష

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు