పట్టుకున్నారు.. వదిలేశారు!

24 Mar, 2016 23:26 IST|Sakshi

 పూసపాటిరేగ :  మండలంలోని కొప్పెర్ల సమీపంలో చంపావతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన పలు ట్రాక్టర్లను అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వదిలేశారు. ఈ ట్రాక్టర్లను నాలుగురోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, దీనిపై అధికారపార్టీ ఒత్తిళ్లు తీవ్రస్థాయికి చేరినట్లు భోగట్టా. రాష్ట్రస్థాయి అధికారుల వరకూ విషయం వెళ్లింది. దీంతో కలెక్టర్, ఎస్పీ చర్చించిన తర్వాత ఇసుక ట్రాక్టర్లను విడిచిపెట్టేశారని సమాచారం.
 
 నివేదికలో మార్పులు?
 పట్టుబడిన ట్రాక్టర్లకు సంబంధించి తొలుత స్థానిక అధికారులు నివేదికలను ఒకలా ఇచ్చినట్లు తెలిసింది. వంతెనలు, తాగునీటి బావులకు 500 మీటర్ల దూరంలో తవ్వాల్సి ఉందని, ఆ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతుండగా సదరు ట్రాక్టర్లను పట్టుకున్నామని తొలుత ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు సమాచారం. పై నుంచి ఒత్లిళ్లు రావడంతో అ తర్వాత నివేదికలో మార్పులు చేసినట్లు భోగట్టా. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి తుది నివేదిక పంపించాలని తహశీల్దార్ జయదేవికి ఆదేశాలు వచ్చాయి.
 

మరిన్ని వార్తలు