20 మంది చిన్నారులకు అస్వస్థత

28 Feb, 2018 12:55 IST|Sakshi
చికిత్స పొందుతున్న చిన్నారులు

ఆలూరు: నియోజకవర్గంలోని ఆలూరు, హాలహర్వి, హొళగుంద మండలాలకు చెందిన 20మంది చిన్నారులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వారి కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చించారు. రెండు రోజుల నుంచి కలుషిత నీరు తాగడం, ఎండవేడిమి ఎక్కువ కావడంతోనే విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైనట్లు చిన్న పిల్లల వైద్యుడు జయకృష్ణ తెలిపారు. ఆలూరుకు చెందిన హేమంత్‌ (6), హేమలత (6), గిరీష్‌ (7), ఉషా (5), పెద్దహోతూరు సందీప్‌ (5), కురువెళ్లి రంగస్వామి (7), అంగస్‌కల్లు నందిని (16), మాచనూరు చంద్రశేఖర్‌ (6), సులువాయి చిట్టి (7)తో పాటు మరో 11 మంది వివిధ గ్రామాలకు చెందిన చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా చిన్నారులను ఎండలో వదలొద్దని, ఈగలు, దోమలు వాలిన ఆహార పదార్థాలను ఇవ్వవద్దని డాక్టర్‌ జయకృష్ణ సూచించారు. నీటిని కాచి, వడబోసి చల్లారిన తర్వాత పిల్లలకు తాపించాలన్నారు. 

మరిన్ని వార్తలు