ఏపీ ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం: ఐఎంఏ

1 Jul, 2020 18:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా 1,088 అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై దేశవ్యాప్తంగా అనేకమంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెట్టిన ఏపీ ప్రభుత్వ చర్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ స్వాగతించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘1088 అంబులెన్స్‌లను ప్రారంభించడం స్వాగతించాల్సిన విషయం. ఏపీకి గొప్ప చరిత్ర ఉంది. వైద్యుల పరిరక్షణ కోసం బిల్లును  ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కరోనా నేపథ్యంలో ప్రతి ఇంటిని పరీక్షించడం, రోగుల వైద్య చరిత్రను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి  ఐఎంఏ సిద్దంగా ఉందని’ తెలిపారు. పబ్లిక్‌ హెల్త్‌కేర్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలని, అవసరమైతే ఈ విషయంలో ప్రైవేట్‌ సెక్టార్‌తో కలిసి పనిచేయాలని డాక్టర్‌ రాజన్‌ శర్మ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్‌)

బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. దీంతో పాటు 108 సిబ్బంది జీతాలను కూడా భారీగా పెంచారు. (కంగ్రాట్స్​ సీఎం సార్)

మరిన్ని వార్తలు