పిడుగులు పడతాయి జాగ్రత్త!

4 Sep, 2017 08:56 IST|Sakshi
పిడుగులు పడతాయి జాగ్రత్త!

సాక్షి, విశాఖపట్నం: తెలంగాణ, కోస్తాంధ్రలో మళ్లీ పిడుగులు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని ఆదివారం ఐఎండీ తెలిపింది. మరోవైపు రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నాయి.

కోస్తాంధ్ర, రాయలసీమలపై నైరుతి రుతుపవనాలు సాధారణంగా ప్రభావం చూపుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గడచిన 24 గంటల్లో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కుప్పంలో 9 సెం.మీ, బాపట్లలో 8, వెంకటగిరికోట 5, చిన్నమండెం, కందుకూరు, కారంచేడుల్లో 4, నెల్లూరు, పుంగనూరు, పాలసముద్రంలలో 3, సత్యవేడు, ఓబులదేవరచెరువు, శాంతిపురం, గుర్రÆ కొండ, సాంబేపల్లి, వింజమూరు, ప్రత్తిపాడు, దర్శి, మంగళగిరి, సత్తెనపల్లెల్లో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు