పురుషాధిక్యం..!

31 Jan, 2014 03:33 IST|Sakshi

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్లనమోదు ప్రక్రియ ఈ సారి కొత్త రికార్డులను సృష్టించింది. జిల్లాపై గతంలో ఎనిమిది వేల పైచిలుకు ఆధిక్యత చాటుకున్న మహిళలను ఈమారు పురుషులు అధిగమించారు. ఇక ప్రత్యేక ఓటర్లు 204 మందికి హక్కు లభించింది. పాలమూరులో వనపర్తి ఓటర్లుతో అగ్రతాంబూలం అందుకుంటే జిల్లా కేంద్రం వెనుకబడింది. మొత్తానికి అధికారికంగా జాబితా వెలువడనుంది.
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా ఓటర్ల సంఖ్యను అధికారులు తేల్చారు. మార్పులు చేర్పుల అనంతరం, కొత్త వారికి అవకాశం కల్పించగా, ఈసారి మనజిల్లా ఓటర్లు 28,43,892కు చేరింది. వీరిలో పురుషులు 14,28,966, మహిళలు 14,14, 518 ఉన్నట్లు తేల్చారు. ఇక ఇటీవల కాలం లో చేపట్టిన ఓటర్ డ్రైవ్‌కు 1,40,801దరఖాస్తులు రాగా, వాటిలో కేవలం సగం మందికే  71,254మందికి కొత్తగా అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తుల్లో విచారణ పేరిట 37,917, జాబితా విడుదల అనంతరం 31,630దరఖాస్తులు వచ్చాయని వాటిని పక్కన పెట్టారు.
 
 ఇతరుల కాలంలో...
 మహిళలు, పురుషులు జాబితాలోకి రాకుండా ఉన్న  ‘ప్రత్యేక’ ఓటర్లు ఈసారి 204మంది ఉన్నట్లు తేల్చారు. వీరిని నివేదికలో ఇతరుల కాలంలోకి చేర్చారు.
 
 దీటుగానే తొలగింపు...
 ఇది వరకు విడుదల చేసిన జాబితాల్లోంచి 54,616మందిని తొలగించారు. వీరిలో చనిపోయిన వారు 16,142, ఇతర పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన వారు 23,706, రెండుచోట్ల నమోదైనవి 14,768 వంతున ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇక ఈసారి విచారణలో 37,917, జాబితా వి డుదల చేశాక పక్కన పెట్టిన దరఖాస్తులు 31,630 మొత్తం 69, 547మంది అవకాశా న్ని కోల్పోయారు. దీంతో పాత జాబితా కొత్త జాబితా కలిసి 1,24,163మందిని అధికారులు తొలగిం చినట్లేనని తెలుస్తోం ది. గతేడాది జిల్లా ఓ టర్లు 27,72,434 ఉండగా, ఈసారి కేవ లం లక్షల్లో దరఖాస్తు లు వచ్చినా కేవలం 71,254మందికి అవకాశం కల్పిం చడంతో కాస్తే పెరి గింది.
 
 తొలగింపుకోసం 25వేలు...
 ఈసారి గతంలో లేని విధంగా తొలగింపున కు 25,315దరఖాస్తులు రాగా,వాటిలో 22, 986దరఖాస్తులను పరిష్కరించి, 2,329 అభ్యర్థనలను పెండింగ్‌లో పెట్టారు.
 
 నెంబర్‌వన్‌లో వనపర్తి.....
 జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే వనపర్తి నెంబర్‌వన్ స్థానంలో ఉంది. అందుకేనేమో వనపర్తిని జిల్లా కేంద్రంగా మార్చాలని నేతలు పట్టుబడుతున్నారు. ఇక నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో కొత్త వాటికంటే తొలగించినవే ఎక్కువగా ఉన్నాయి. సిద్దం చేసిన ఓటరు తుది జాబితాను అధికారులు నేడు అధికారికంగా విడుదల చేయనున్నారు. విడుదల చేసిన జాబితాను పోలిం గ్ కేంద్రాలతోపాటు, అన్ని రాజకీయపార్టీలకు అందజేయనున్నారు.
 

మరిన్ని వార్తలు