సాక్షి, తిరుమల: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెల కొన్న సమస్యలన్నీ సామరస్యంగానే పరిష్కారం అవుతాయని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఇందుకోసం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారు కూడా ఆశీస్సులు అందజేస్తారని ఆయన ఆకాం క్షించారు.
బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. కాగా రాష్ర్ట గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం సాయంత్రం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో శ్రీవారిని దర్శిం చుకున్నారు. గురువారం తిరుప్పావడ సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు.
2015 టీటీడీ కేలండర్, డైరీ ఆవిష్కరణ
2015 నూతన సంవత్సరం 12 షీట్ల టీటీడీ కేలండర్, డైరీలను గవర్నర్ ఆవిష్కరించారు. శ్రీవారి కేలండర్, డైరీ పొందినవారికి అంతా మంచే జరుగుతుందని గవర్నర్ అన్నారు. 20 లక్షల కేలండర్లు, 6 లక్షల డైరీలు అందుబాటులో ఉన్నాయని నరసింహన్ తెలిపారు.