రికార్డుల్లో 90.. ఉన్నది ఇద్దరు..!

22 Jan, 2014 03:52 IST|Sakshi

గోదావరిఖనిటౌన్, న్యూస్‌లైన్ : ఉంటున్నది ఇద్దరే విద్యార్థులు.. రికార్డుల్లో మాత్రం 90 మంది నమోదు.. ప్రతి నెలా అదే సంఖ్యలో బిల్లులు తయారు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.. ఇదీ గోదావరిఖనిలోని ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ నిర్వాకం. ఈమెను ఉన్నతాధికారులు వేరే ప్రాంతానికి బదిలీ చేసినా.. కొత్తగా వచ్చిన వార్డెన్‌కు రికార్డులు అప్పగించకపోవడం గమనార్హం.
 
 స్థానిక పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గల ప్ర భుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ అక్రమాలకు నిలయంగా మా రింది. విద్యార్థుల రిజిస్టర్‌లో 90 మంది ఉన్నట్లు రికార్డులు చెబతున్నా.. వసతి గృహంలో ఉంటుంది మాత్రం కేవలం ఇద్దరే విద్యార్థులు. వార్డెన్ నిర్వాహకంపై పలు ఆరోపణలు రావడంతో జిల్లా అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారి రాజేశ్వరి మంగళవారం హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఈక్రమంలో అనేక విషయాలు వెలుగు చూశాయి.
 
 హాస్టల్‌లో రెండేళ్ల క్రితం సుమారు 200 వరకు విద్యార్థులుండేవారు. అయితే వారికి సరిపడా సేవలందించడంలో వార్డెన్ రాణి నిర్లక్ష్యం వహించడం వలన క్రమంగా వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీనిని ఆసరాగా చేసుకున్న వార్డెన్ విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ బిల్లులు తీసుకుంటూ వచ్చింది. నెలకు సుమారు రూ.60 వేల వరకు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సా ధారణ బదిలీల్లో భా గంగా ఈమెను ఉన్నతాధికారులు వేరే చోటికి బదిలీ చేశారు. హైదరాబాద్‌లో పని చేసిన వరుణను ఇక్కడికి పంపారు.
 
 ఈ నెల 8న వరుణ విధుల్లో చేరగా.. హాస్టల్ రికార్డులను అందిం చడంలో రాణి నిరాకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వరుణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించి జిల్లా సహాయ సంక్షేమశాఖ అధికారిని విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో హాస్టల్‌లో జరుగుతున్న పరిణామాలపై ఏఎస్‌వోడబ్ల్యూ రాజేశ్వరి మంగళవారం తనిఖీ చేశారు. గతంలో పని చేసిన వార్డెన్ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. విద్యార్థుల సంఖ్య తగ్గడం, భోజనంలో నాణ్యత లోపిం చడంతో పాటు పలు ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏఎస్‌వోడబ్ల్యూ తెలిపారు.
 
 లెక్కల్లో అయోమయం
 విద్యార్థులు హాస్టల్లో లేకున్నా యథావిధిగా 90 మంది ఉన్న ట్లు బిల్లులు మాత్రం పాస్ అవుతున్నాయి. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నెలకు  భోజనం కోసం రూ. 750, కాస్మోటిక్స్ పేరుతో మరో రూ.25లను అందిస్తోంది. ఈ లెక్కల ప్రకా రం 90 మంది విద్యార్థులకు నెలకు సుమారు రూ.70 వేల వరకు మేయింటనెన్స్ కింద బిల్లులు అందుతున్నాయి. అయితే విద్యార్థులు లేకున్నా.. ఈ బిల్లులు ఎటు వెళ్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి అవకతవకలను పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు