మత బోధకుడి కేసులో నిందితుల అరెస్ట్

18 Mar, 2016 02:16 IST|Sakshi
మత బోధకుడి కేసులో నిందితుల అరెస్ట్

 విజయవాడ (గుణదల) : ఓ మహిళతో అశ్లీలంగా ప్రవర్తించారని, దానికి సంబంధించిన వీడియో ఉందనే సాకుతో మత బోధకుడిని డబ్బు కోసం వేధిస్తున్న మీడియా మాజీ ప్రతినిధి సహా ముగ్గురు నిందితులను గురువారం మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా కంకిపాడు మం డలం ప్రొద్దుటూరుకు చెందిన సుధీర్ ఓ ప్రైవేటు కార్యక్రమానికి మతబోధకుడిని ఆహ్వానించాడు. అప్పటినుంచి అతనితో సన్నిహితంగా ఉండేవాడు. తాను ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని చెప్పి మతబోధకుడి వద్ద తరుచూ విరాళాలు తీసుకునేవాడు. ఆ ప్రైవేటు ఫంక్షన్‌లో ఓ మహిళతో అశ్లీలంగా వ్యవహరించారని, ఆ వీడియో తన వద్ద ఉందని సుధీర్.. మతబోధకుడిని రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆయన తన స్నేహితుడితో కలిసి నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిసి విష యం చెప్పారు.

రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఓ శాటిలైట్ చానల్ మాజీ ప్రతినిధి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. సీపీ ఆదేశాల మేరకు నిందితుల్లో ముగ్గురు పాయకాపురానికి చెందిన కోరపాటి జోసఫ్ (ఏ1) , కంకిపాడు ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మరీదు శశిధర్ (ఏ5), మందాటి రామోజిచౌదరి (ఏ8)లను మాచవరం పోలీ సులు అరెస్టు చేశారు. ఏ2గా ఉన్న సుధీర్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకుతమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. సుధీర్, విజ య్, ప్రశాంత్, శ్రీకాంత్, సుబ్రమణ్యం, రాములను విచారిస్తున్నారు.

 మరో మలుపు..
 కీలక నిందితుడిగా భావిస్తున్న న్యాయవాదిని ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదని సమాచారం. ఆ న్యాయవాది చర్చి ఫాదర్‌కు, నిందితులకు మధ్యవర్తిత్వం చేస్తున్నానని, తన వద్ద ఉన్న పెన్‌డ్రైవ్‌లోనివి వీడియోలు కాదని ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది.

 ముగ్గురికి రిమాండ్
విజయవాడ లీగల్ : కేసులో నిందితులైన కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మరీదు శశిధర్, పాయకాపురంలోగల రాధా నగర్‌కు చెందిన కొర్రపాటి జోసఫ్, మండాది రామోజిచౌదరిలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారించిన ఒకటవ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జ్ జడ్జి జి.సత్యప్రభాకరరావు నిందితులకు ఈ నెల 31వరకు రిమాండ్ విధించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. మత బోధకుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కొంతమందిపై 120-బి, 384, 385, 386, 450, 452, 506, 34 ఐ.పి.సి. సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు.

రావి ప్రకాష్ అనే వ్యక్తిని మాచవరం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది రోజులుగా అక్రమంగా నిర్బంధించినట్లు అతని భార్య సమత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన మూడవ అదనపు చీఫ్ మెట్రో పాలి టన్ మెజిస్ట్రేట్ న్యాయవాదిని అడ్వకేట్ కమిషనర్‌గా నియమించి నిందితుడు పోలీసు కస్టడీలో ఉంటే వెంటనే కోర్టులో హాజరు పరచమని ఉత్తర్వులు జారీచేశారు. తీరా స్టేషన్‌కు వెళ్లే సరికి ప్రకాష్ లేడు.
 

మరిన్ని వార్తలు