కొత్త కార్యాలయంలో బాబు

5 Oct, 2014 02:10 IST|Sakshi
కొత్త కార్యాలయంలో బాబు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు విజయదశమి (శుక్రవారం) రోజున సచివాలయం ఎల్ బ్లాక్‌లోని కొత్త కార్యాలయంలోకి  ప్రవేశించారు. వేద పండితుల మంత్రాలు, ఆశీర్వచనాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటలకు కొత్త చాంబర్లోకి అడుగు పెట్టారు. వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి పూజలు చేశారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏడు మిషన్లలో ఒకటైన ప్రాథమిక రంగ మిషన్‌పై తొలి సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి లంకల దీపక్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కార్యాలయం, సచివాలయ సిబ్బంది, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ తదితరులు కూడా చంద్రబాబును అభినందించారు. ద్వితీయ విఘ్నం కలగకుండా చంద్రబాబు రెండో రోజు శనివారం తన కార్యాలయానికి వచ్చారు.
 6న ప్రాథమిక రంగ మిషన్‌పై విధానపత్రం
 ప్రాథమిక రంగ మిషన్‌పై విధానపత్రాన్ని 6వ తేదీన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చంద్రబాబు విడుదల చేయనున్నారు.     
 

>
మరిన్ని వార్తలు