రెండో విడత కౌన్సెలింగ్‌కోసం మరోసారి సుప్రీంకు

18 Sep, 2014 00:58 IST|Sakshi

నేడు పిటిషన్ దాఖలు చేయనున్న ఏపీ ఉన్నత విద్యామండలి
 
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలని మరోసారి సుప్రీంకోర్టును అర్థించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. దాదాపు 70వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర వాదనలు వినిపించేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇరు రాష్ట్రాల్లోనూ విద్యార్థులు నష్టపోతున్నందున రెండో విడత కౌన్సెలింగ్‌కోసం సహకారం అందించాలని రాష్ట్ర మానవవనరుల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవా రం తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో గంటా ఫోన్లో మాట్లాడారు.

నేటినుంచి ఏపీలో కేంద్రకమిటీ పర్యటన

విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్రకమిటీ గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. తిరుపతి, విజయవాడ, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కర్నూలు, అనంతపు రం జిల్లాల్లో ఈ కమిటీ పర్యటించనుంది.
 

>
మరిన్ని వార్తలు