బాంబులను ఇట్టే పట్టేస్తుంది...!

12 Oct, 2015 23:48 IST|Sakshi
బాంబులను ఇట్టే పట్టేస్తుంది...!

పేరు    :    రాంబో
వయస్సు    :    10 ఏళ్లు (మేల్)
పుట్టింది    :    సికింద్రాబాద్‌ల
పెరిగింది    :    రాయగడలో
పట్టింది    :    100కు పైగా బాంబులు
బరువు    :    35 కిలోలు
రంగు    :    నలుపు

 
రిటైరైన స్నిపర్ డాగ్ రాంబో
రైల్వేలో 10 ఏళ్ల సర్వీసు పూర్తి
రూ. 17,100కు వేలం వేసిన ఆర్‌పీఎఫ్

 
విశాఖపట్నం సిటీ :  ఆ కుక్క బాంబ్‌లను వెతికిపట్టడంలో దిట్ట. కొండా కోనల్లో బాంబులు పాతాళంలో పాతినా సులువుగా పట్టేయగల నేర్పరి. వాసన పసిగట్టిందో బాంబ్ స్క్వాడ్‌లకు కూడా దొరకని బాంబులను కాలితో వెలికితీసి మరీ చూపించగల శునకమది. వాల్తేరు రైల్వే పరిధిలోని రాయగడ కేంద్రంగా 10 ఏళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్న ఆ రాంబో అనే పేరుగల స్నిఫర్  డాగ్‌ను రైల్వే రక్షక దళ కమాండర్ కార్యాలయంలో ఇటీవల వేలం పెట్టారు. ఈ వేలానికి హాజరైన పలువురు జంతు ప్రేమికులు తమకు కావాల్సిన రేటుకు కోట్ చేశారు. నగరానికి చెందిన మహ్మద్ ఎంఎం బాషా అనే జంతుప్రేమికుడు ఆ శునకానికి రూ. 17,100కు కొనుక్కున్నాడు. సోమవారం ఆర్పీఎఫ్ అధికారులు ఆ కుక్కను బాషా కుటుంబీకులకు అప్పగించారు.

 సికింద్రాబాద్ బొగాడి కెన్నల్స్‌లో 10 ఏళ్ల క్రితం రాంబోను రూ. 10,500కు వాల్తేరు రైల్వే రైల్వే రక్షక దళం కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 9 మాసాల పాటు శిక్షణ ఇచ్చారు.  ఓ మాస్టర్‌కు నెలకు రూ. 30 వేల జీతం ఇచ్చి కుక్కకు బాంబ్‌లను తనిఖీ చేసే తర్ఫీదునిచ్చారు. శిక్షణానంతరం దండకారణ్యంలోనే రాంబో డాగ్ సర్వీసు మొత్తం పూర్తి చేసుకుంది.
 

మరిన్ని వార్తలు