ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

31 Mar, 2017 21:41 IST|Sakshi
► రైలుకింద పడి బలవన్మరణం
గరివిడి(చీపురుపల్లి): ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందోగానీ ఇద్దరు బిడ్డలతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 4గంటలకు గాంధీధామ్‌ నుంచి పూరీ వైపు వెళ్లే స్పెషల్‌రైలు గరివిడి స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ ఐదేళ్లు, మూడేళ్లు వయసుగల ఇద్దరు కుమార్తెలతో అకస్మాత్తుగా రైలుకిందకు దూకింది.
 
రెప్పపాటు కాలంలో వారి శరీరాలు నుజ్జునుజ్జు అయ్యాయి. వారు ఎవరో ఎక్కడినుంచి వచ్చారో తెలియదనీ స్టేషన్‌మాస్టర్‌ తెలిపారు. శ్రీకాకుళం సీఆర్‌పీఎఫ్‌, విజయనగరం ఆర్‌పీఎఫ్‌కు సమాచారం అందించామనీ, వారు వచ్చి దర్యాప్తు చేసిన తరువాత వారెక్కడినుంచి వచ్చారో తెలుస్తుందని తెలిపారు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు