లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు

13 Feb, 2020 20:33 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లలితా రైస్‌ మిల్స్‌లో ఐటీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఏడు బృందాలుగా ఏర్పడి అధికారులు ఈ తనిఖీలు జరిపారు. కాగా లలితా రైస్‌మిల్స్‌ యజమానులు మట్టే ప్రసాద్‌, శ్రీనివాస్‌.. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అత్యంత సన్నిహితులు. ఖరీదైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షాటెక్స్‌ యంత్రాలతో మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని నౌకల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులుగా వీరికి పేరుంది.

కాగా మట్టే సోదరులు.. ఒక షాటెక్స్‌ యంత్రానికి అనుమతి తీసుకుని, దాని పేరు మీద మరిన్ని షాటెక్స్‌ యంత్రాలతో బియ్యాన్ని మిల్లింగ్‌ చేసి కోట్లాది రూపాయలు అక్రమార్జన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హయాంలో అచ్చంపేట వద్ద మాజీ హోంమంత్రి చినరాజప్పకు క్యాంప్‌ కార్యాలయం భవనాన్ని మట్టే సోదరులే బహుమతిగా  ఇచ్చారని ప్రచారం ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెజవాడలో జరగడం బాధాకరం: సీపీ

కరోనా: వారిపైనే సిక్కోలు దృష్టి

కరోనాతో హిందూపూర్ వాసి మృతి

కరోనా వైరస్‌: ‘పాజిటివ్‌’ ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ 

కోవిడ్‌: వారిలో 89 మందికి నెగిటివ్‌ 

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...