ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలి

28 Aug, 2014 01:23 IST|Sakshi
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలి

విజయనగరం ఆరోగ్యం:ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని అప్పుడే ప్రజలు ఆస్పత్రికి వస్తారని ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ(ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఎం.డి, విజయనగరం, విశాఖపట్నం ప్రత్యేకాధికారి ముద్దాడ రవిచంద్ర అన్నారు. జిల్లాకు బుధవారం వ చ్చిన ఆయన డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియూ, జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని రకాల వైద్య పరీక్షలు జరిగేటట్టు చూడాలన్నారు.
 
 ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలు ఏ మోతాదులో ఇవ్వాలో ఆశ వర్కర్లకు పూర్తి స్థారుులో అవగాహన కల్పించాలని సూచించారు. జింక్ మాత్రల విషయమై ఇండెంట్ మార్చాల్సి వచ్చిందని చెప్పారు. గర్భిణులకు సంబంధించి కొనుగోలు చేసే పరికరాల వివరాలను 15 రోజులకొకసారి పంపించాలని ఆదేశించారు. పీహెచ్‌సీలకు ఇచ్చిన ల్యాప్‌ట్యాప్‌లు ఎవరు వినియోగిస్తున్నారో వివరాలు పంపాలన్నారు. ఐరన్, ఫోలిక్ మాత్రలు పంపిణీ చేయడంలో సిబ్బంది విఫలమవుతున్నారని చెప్పారు.
 
 అంగన్‌వాడీ కార్యకర్తలతో సమన్వయం కొరవడుతోందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడడం, మందులు అవసరం మేరకు అందజేయడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేరుుంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఆస్పత్రులకు శానిటేషన్ నిధులు రెట్టింపు చేశామని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐఎస్‌ఐ మార్కు కలిగిన రసాయనాలతో శుభ్రపరచాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని, వారికి బ్యాంకు ద్వారా జీతా లు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిం చాలని ఆదేశించారు.
 
 కేజీహెచ్‌లో పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడితే రూ.3700 ఇస్తున్నారని చెప్పారని, అటువంటి మోసానికి పాల్పడకుండా చూడాలన్నారు. పీహెచ్‌సీలో డాక్టర్, ఫార్మసిస్ట్, స్టాఫ్‌నర్సు ల్లో ఎవరో ఒకరు ఉన్నా వంద వరకు ఓపీ వస్తుందన్నారు. ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడం వల్లే ఓపీ తగ్గిపోతుందని చెప్పారు. మెడికల్ షాపు ల్లో ఫార్మసిస్ట్‌లు పూర్తి స్థారుులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే మండలానికొక జనరిక్ మందుల దుకాణాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వైద్యులు పలు సమస్యలు ఎండీ రవిచంద్రకు తెలియజేశారు. సమావేశంలో కేంద్రాస్పత్రి సూ పరింటెండెంట్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.  
 
 సెంట్రల్ డ్రగ్ స్టోర్ పరిశీలన...
 సమావేశ అనంతరం ఎం.డి. రవిచంద్ర సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను పరిశీలించారు. నిల్వ ఉన్న మందులపై ఆరా తీశారు. కార్యాలయూనికి కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయూలని ఈఈ టీవీఎస్‌ఎన్ రెడ్డిని ఆదేశించారు.
 
 సమావేశంపై తప్పుడు సమాచారం...
 ఎం.డి రవిచంద్ర సమీక్ష సమావేశానికి సంబంధించి వైద్యారోగ్య శాఖాధికారులు తప్పుడు సమాచారంతో తికమక పెట్టారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్‌లో సమీక్ష అని తొలుత తెలిపారు. తరువాత సమీక్ష సమావేశం రద్దరుుందని మీడియూకు చెప్పారు. తరువాత డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమాచారం మాత్రం మీడియూకు తెలియజేయలేదు.
 
 ఆస్పత్రి నిర్వహణపై ప్రత్యేక దృష్టి
 బెలగాం: ఆస్పత్రి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ ఎం.డి. రవిచంద్ర అన్నారు. ఇక్కడి ఏరియూ ఆస్పత్రిని ఆయన బుధవారం రాత్రి సందర్శించా రు. ఆస్పత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెనూ సక్రమంగా అమలు చేయూలని సూచించారు. ఆయ న వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, జిల్లా ఆస్పత్రుల సమన్వయూధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఏరియూ ఆస్ప త్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఎస్‌ఈ చిట్టిబాబు, ఈఈ టీవీఎస్‌ఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు