సగం మందికే రుణమాఫి

14 Sep, 2014 04:04 IST|Sakshi
సగం మందికే రుణమాఫి

► ఉద్యానవన రైతులు, మత్స్య, పౌల్ట్రీ, డెయిరీ, ఎరువుల లోన్లకు మాఫీ వర్తించదట
►పడమటి ప్రాంతాల్లో ఉద్యానవన పంటలే అధికం
►ప్రభుత్వ నిబంధనలతో లబోదిబోమంటున్న అన్నదాతలు
పలమనేరు: చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ చట్రంలో ఇరుక్కుని రైతులు గిలగిలా కొట్టుకుంటున్నారు. ప్రభుత్వం రోజుకో జీవో విడుదల చేస్తూ రుణమాఫీలో షరతుల పేరిట మాఫీ భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. ఫలితంగా అర్హులైన రైతులు సైతం రుణమాఫీ పొందలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉద్యానవన రైతులకు మాఫీ వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. తద్వారా తాము ఏమి పాపం చేశామంటూ ఆయూ పంటలు సాగుచేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలే అధికం

పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లె ప్రాంతాల్లో ఉద్యానవన పంటల సాగు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా టమాట ఎక్కువగా సాగవుతోంది. పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో మాత్రం అన్ని కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఇక 20 శాతం వరకు రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. వీరందరూ హార్టికల్చర్ కిందకే వస్తారు. ఈ ప్రాంతంలో మత్స్య కార సహకార సంఘాలు సైతం 80కి పైగానే ఉన్నాయి. పలమనేరు, గంగవరం మండలాల్లో జిల్లాలోనే అధికంగా కోళ్ల రైతులున్నారు. మరోవైపు పాడిఆవుల పెంపకం ద్వారా జీవనోపాధి పొందే రైతులు ఇక్కడ 50 శాతం మంది ఉన్నారు. వీరందరూ వారి అవసరాల కోసం రుణాలు తీసుకున్నారు.
 
వీరందరికీ రుణమాఫీ వర్తించదట

టమాట సాగుచేసే రైతులు పంట రుణాలు పొందారు. మరికొందరు 10(1), అడంగల్‌లో టమాట సాగును చూపెట్టి బంగారు రుణాలు తీసుకున్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో పది రకాల కూరగాయల పంటల సాగు కోసం రైతులు వివిధ బ్యాం కుల్లో రుణాలు తీసుకున్నారు. పాడి రైతులు పలు బ్యాంకుల్లో మినీ డెయిరీ పేరిట(నాలుగు పాడి ఆవుల కొనుగోలుకు రుణం పొందవచ్చు)రుణాలు పొందారు.

మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలోనూ సహకార సంఘాల్లో రు ణాలు తీసుకున్నారు. మరికొందరు సంబంధిత సింగిల్‌విండోల్లో ఎరువుల కొనుగోలు కోసం రుణాలు తీసుకున్నారు. జిల్లా మొత్తం మీద 8.7 లక్షల మంది రైతులు రూ.11,180.25 కోట్ల పంట రుణాలు పొందారు. ఒక్క మదనపల్లె డివిజన్‌లోనే ఉద్యానవన పంటల సాగు కోసం రైతులు బ్యాంకు నుం చి తీసుకున్న రుణం దాదాపు రూ.80 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. ఇ వన్నీ మాఫీ పరిధిలోకి రానట్టే.
 
లబోదిబోమంటున్న రైతులు

రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్(జీవో ఎంఎస్ నం.174)లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. ఫలితంగా ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టమాట రైతుల్లో అయోమయం నెలకొంది. రుణాలు మాఫీకాకపోతే వడ్డీ సహా తీర్చడం తలకుమించిన భారంలా మారడం ఖాయం. బా ధిత రైతులు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.
 
ఇంతకన్నా నమ్మక ద్రోహముందా
రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు ఈ మాట చెప్పుంటే బాగుండు. అన్ని రుణాలు మాఫీ అని హా మీ ఇచ్చి ఇప్పుడు సవాలక్ష రూల్స్‌పెట్టి రైతుల నోర్లు కొట్ట డం మంచిది కాదు. ఇంతకన్నా నమ్మక ద్రోహం మరొకటి ఉంటుందా.   -శేషేగౌడు, చీలంపల్లె, బెరైడ్డిపల్లె మండలం
 
చెరుకు రైతులకే రుణమాఫీ వర్తిస్తుందంటే ఎట్టా
ఈ ప్రాంతంలో చెరుకుసాగు పూర్తిగా తగ్గింది. సగానికి పై గా రైతులు టమాట, పలు కూరగాయలను సాగుచేస్తున్నా రు. వాటికోసమే బ్యాంకులో అప్పులు తీసుకున్నాం. ఇప్పు డు వాటికి రుణమాఫీ చేయడం కుదరదంటే ఎంతవరకు న్యాయం.  -మోహన్‌రెడ్డి, మేకల నాగిరెడ్డిపల్లె, బెరైడ్డిపల్లె
 
రుణమాఫీ ఓ ట్రాష్
ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో రుణమాఫీని పెట్టినట్టు అందరికీ తెలిసిపోయింది. రూ.1.5 లక్షల రుణమాఫీలో లే నిపోని రూల్స్ పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టేది అవసరమా. దీనికన్నా మావల్ల చేతకాదంటూ ఈ ప్రభుత్వం రుణమాఫీ ని వదిలేస్తే పోలా.          -రవి, కూర్మాయి, పలమనేరు

>
మరిన్ని వార్తలు