హడలెత్తిస్తున్న స్వైన్‌ఫ్లూ

21 Jan, 2015 02:17 IST|Sakshi
హడలెత్తిస్తున్న స్వైన్‌ఫ్లూ

హైదరాబాదును హడలెత్తిస్తున్న స్వైన్‌ఫ్లూ జిల్లావాసులనూ బెంబేలెత్తిస్తోంది. నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో 300 మందికి ఈ వ్యాధి సోకగా,  30 మంది మృతిచెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో నగరంలో స్వైన్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఎటువంటి సదుపాయాలు లేవు. కనీసం మాస్క్‌లు కూడా అందుబాటులో లేవు.
 
లబ్బీపేట : మూడేళ్ల  కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన హెచ్1 ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా ై(స్వైన్ ఫ్లూ) వైరస్ ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలను హడలెత్తిస్తోంది. నెలరోజుల్లో 300ల వరకూ స్వైన్ కేసులు నమోదవగా, 30 మంది వరకూ మృతి చెందారు. తెలంగాణ లోని నాలుగు జిల్లాలు, అంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిలాలో సైతం స్వైన్ మరణం నమోదైంది. తాజా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ బాధితులకు వైద్యం చేసే సమయంలో సరైన రక్షణ పరికరాలు లేక వైద్యులకు సోకిన విషయం తెలి సిందే. నెలరోజులుగా తెలంగాణ లో స్వైన్‌ప్లూ వణికిస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం  ఇప్పటి వరకూ  ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదయ్యే అవకాశం ఉంది.
 
మందుల్లేవ్.. మాస్కుల్లేవ్

నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో ఇప్ప టి వరకూ స్వైన్‌ఫ్లూకు సంబంధిం చిన మందులు, మాస్కులు  అందుబాటులోకి రాలేదు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు గుర్తించిన వారిని ప్రత్యేక వార్డులో ఉంచి టామీ ఫ్లూ మందు లు, యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సి ఉంది.   ఆ వార్డులో   వైద్యు లు, సిబ్బందికి ప్రత్యేక యూనిఫామ్, డబుల్, త్రిబుల్ లేయర్ మాస్క్‌లు వినియోగించాల్సి ఉంది.  ఇప్పటికైనా వాటిని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో పాత ప్రభుత్వాస్పత్రిలోని పల్మనాలజీ విభాగంలో స్వైన్ ఫ్లూ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.  ప్రస్తుతం పల్మనాలజీ విభాగంలో  అసిస్టెంట్ ప్రొఫెసర్లే సేవలు అందిస్తున్నారు. గతంలో క్యాజువాలిటీలో స్వైన్ ఫ్లూ స్క్రీనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ వ్యాధి లక్షణాలతో వచ్చిన వారికి పరీక్షలు చేసి ప్రత్యేక వార్డుకు తరలించేవారు. ఇప్పుడు కూడా దానిని ఏర్పాటు చేయాల్సి ఉంది.

స్వైన్ ఫ్లూ లక్షణాలివే

సాధారణ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కనిపించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయని నిపుణులు చెపుతున్నారు. తీవ్ర జ్వరం, గొంతునొప్పి, శరీరంపై బొబ్బలు, ఉన్నట్లుండి వాంతులు, తరచూ విరేచనాలు అవుతుండటం, ముక్కు దిబ్బ డ, ముక్కు, కళ్లనుంచి నీరు కారడం, భరించలేని ఒంటినొప్పులు ఉంటే  వెంటనే వైద్యులను సంప్రదించాలి.  
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సాధ్యమైనంత వరకూ రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచి ది. తప్పనిసరయితే నోటికి, ము క్కుకు మూడు లేయర్ల మాస్కు ను ధరించాలి.  ఉమ్మివేయడం,  షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు. చిన్నపిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు.
 

మరిన్ని వార్తలు