కొండెక్కిన కొత్తిమీర!

17 Jul, 2015 01:46 IST|Sakshi
కొండెక్కిన కొత్తిమీర!

రంజాన్‌లో పెరిగిన కొత్తిమీర వాడకం
జిల్లా వ్యాప్తంగా 100 హెక్టార్లలోనే సాగు
కొత్తిమీర కట్ట  రూ.50పైమాటే

 
 మదనపల్లె: మొదలే రంజాన్.. కొత్తిమీర ఘుమఘుమలు మామూలే. అందుకే ఇటీవల దీనికి భలే డిమాండ్ పెరిగింది. కట్ట కొనాలన్నా రూ.50కు పైగా వెచ్చించాల్సి వస్తోంది.జిల్లా వ్యాప్తంగా కేవలం వంద హెక్టార్లలో కొత్తిమీర పంటను పండిస్తున్నారు. పుంగనూరు, రామకుప్పం, వీకోట, శాంతిపురం, నిమ్మనపల్లి, రామసుద్రం, పుంగనూరు, మదనపల్లెరూరల్, చౌడేపల్లి, పెద్దపంజాణి, భాకరాపేట వంటి మండలాల్లో మాత్రమే సాగవుతోంది. జిల్లాలో అతి తక్కువ హెక్టార్లలో పండిస్తున్న ఏకైక పంట కొత్తిమీర కావడం గమనార్హం. ప్రస్తుతం కట్ట కొత్తిమీర మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.60 పలుకుతోంది. హైబ్రిడ్ రకం ధనియాలు సాగుచేస్తే కొత్తిమీర రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది.

 రైతుకు సిరులు
 రైతులు ఎకరం పొలంలో కొత్తిమీరను పండిస్తే సుమారు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వస్తోంది. డిమాండుకు తగ్గస్థాయిలో పంట దిగుబడి లేకపోవడంతో అధిక స్థాయిలో ధర పలుకుతోందని వ్యాపారులు అంటున్నారు.

 పెరిగిన కొత్తిమీర వాడకం
 రంజాన్‌లో ముస్లింలు రోజా(ఉపవాస దీక్షలు)లు ఉండి సాయంత్రం నమాజు అనంతరం ఉపవాసాన్ని విరమించే సమయంలో అధిక శాతం మాంసాహార విందుకు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో కొత్తిమీర వాడకం ఎక్కువయింది.

 

మరిన్ని వార్తలు