విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన

17 Oct, 2018 08:56 IST|Sakshi

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు 

గ్యాంగ్‌ రేప్‌ వార్తలు అవాస్తవం అన్న సీపీ ద్వారకాతిరుమలరావు

ఇబ్రహీంపట్నం : ఫేస్‌బుక్‌ పరిచయంతో ఓ విద్యార్థినిని హోటల్‌రూమ్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మైలవరంలోని ఓ కళాశాలలో చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న స్థానికంగా ఉన్న కేవీఆర్‌ గ్రాండ్‌ హోటల్‌ రూమ్‌ను బుక్‌చేసుకుని కారులో ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడు. కొంత సమయానికి అతని స్నేహితులు మరో ఇద్దరు ఆ రూమ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లినట్లు తెలిసింది. 

బెదిరింపులు..
అనంతరం సెల్‌ల్లో చిత్రీకరించిన వ్యక్తులు మొదటి వ్యక్తిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు సంపాదించాలని యత్నించారు. వీడియోను ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పెడతామని బెదిరిం చారు. కొండపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ముగ్గురి మధ్య పంచాయతీ నిర్వహించారు. విషయం పోలీసులకు తెలియటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లైంగిక దాడి జరగలేదు : సీపీ 
ఓ టీవీ చానల్‌లో మంగళవారం ప్రచారమైనట్లుగా ఇబ్రహీంపట్నంలోని కేవీఆర్‌ గ్రాండ్‌ హోటల్‌లో యువతిపై గ్యాంగ్‌ రేప్‌ జరగలేదని నగర సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. చానల్‌లో గ్యాంగ్‌ రేప్‌ వార్త చూసిన వెంటనే తాము అప్రమత్తమై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు. హోటల్‌కు వచ్చి వెళ్లిన యువతి ఆచూకి తెలుసుకుని ఆమెతో మాట్లాడామని.. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఆమె స్పష్టం చేసిందన్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వ్యక్తితో హోటల్‌కు వెళ్లినమాట వాస్తవమేనని.. అతనితోపాటు మిత్రులు ఇద్దరు హోటల్‌రూమ్‌లో తనపై అసభ్యంగా ప్రవర్తించగా.. ప్రతిఘటించి వారి బారి నుంచి బయటపడ్డానని వివరించారని చెప్పారు. ఈ విషయం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందని భయపడి కేసు పెట్టలేదని ఆమె వివరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నగరానికి దూరంగా ఉన్నారని.. రాగానే కేసు పెట్టమని కోరామని చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింగిల్‌ క్లిక్‌తో జిల్లా సమాచారం

కూతకు వెళ్తే పతకం కానీ అడ్డుగా పేదరికం

కొండముచ్చు.. ప్రజెంట్‌ సార్‌

‘అది తప్పుడు ప్రచారం; ప్రజల దృష్టికి తీసుకెళ్లండి’

మారని వైస్‌ చాన్సలర్‌ తీరు!

పోలీసు శాఖలో ప్రక్షాళన దిశగా అడుగులు 

తరిమి కొట్టి.. చెట్టుకు కట్టి..

‘బాబు స్వార్ధం కోసం సభను వాడుకుంటున్నారు’

సారూ.. మా నోట్లో మట్టి కొట్టొద్దు!

ఆక్వా రైతులకు మేత భారం

అవినీతిని సహించేది లేదు..!

అతివేగం; టాటాఏస్‌పై పడిన వోల్వో బస్‌

'అధ్యక్షా.. మమ్మల్ని వెనుకబెట్టారు'

సర్వజనాస్పత్రికి జీవం పోసిన వైఎస్‌ జగన్‌

ఆ పాఠాలు ఉండవిక...

ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో వరుణయాగం ప్రారంభం

160 కిలోల గంజాయి స్వాధీనం

పెన్షనర్లకు 27 శాతం ఐఆర్‌

భార్యపై అనుమానంతో..

రైతు పారకు కేరాఫ్‌ వండానపేట

మంగళగిరి ఎయిమ్స్‌ సభ్యుడిగా విజయసాయిరెడ్డి

శభాష్‌ రమ్య!

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల నిలిపివేత

గుండెల్లో దా‘వాన’లం 

విషాదంలోనే..వలంటీర్‌ ఇంటర్వ్యూకు హాజరు

ఎన్నికల సామగ్రి ఎత్తుకెళ్లారు!

బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు

విశాఖ నగరాభివృద్ధికి నవోదయం

గ్రామాల్లో కొలువుల జాతర

ఎన్‌కౌంటర్ల దర్యాపుపై సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ