బీపీవోలో ఏపీ ఫస్ట్‌

20 Jun, 2020 03:38 IST|Sakshi

ఇండియా బీపీవో ప్రమోషన్‌ స్కీంలో రాష్ట్రానికి అత్యధిక సీట్లు 

రాష్ట్రంలో ఇప్పటివరకు 56 బీపీవో కంపెనీల యూనిట్లు ఏర్పాటు

45,000 మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి 

కరోనాతో ఏపీ వైపు చూస్తున్న ఉత్తరాది బీపీవో కంపెనీలు

ఈ ఏడాది సీటింగ్‌ సామర్థ్యం రెట్టింపు అవుతుందటున్న ఎస్‌టీపీఐ

సాక్షి. అమరావతి: ఐటీ రంగానికి సంబంధించి బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌ సోర్సింగ్‌ (బీపీవో)లో రాష్ట్రం దూసుకుపోతోంది. కేంద్ర సమాచార, ప్రసారశాఖ ప్రవేశపెట్టిన ఇండియా బీపీవో ప్రమోషన్‌ స్కీం (ఐబీపీఎస్‌) కింద ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక బీపీవో యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఐబీపీఎస్‌ ద్వారా కేంద్రం 51,297 సీటింగ్‌ సామర్థ్యాన్ని కేటాయించగా మన రాష్ట్రం ఒక్కటే 14,692 సీట్లను దక్కించుకున్నట్లు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) విశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.పీ దూబే తెలిపారు. ఈ స్కీం కింద మొత్తం 56 కంపెనీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేశాయని, ఒక్కో సీటుపై రోజుకు మూడు షిప్టులు చొప్పున దాదాపు 45,000 మందికి ప్రత్యక్షంగా, మరో రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. గత ఏడాది కాలంలో ఈ యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించాయని, ఇప్పటివరకు 9,560 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ఇందులో 40 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. రానున్న కాలంలో మహిళా ఉద్యోగులను 52 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 

ఐబీపీఎస్‌ అంటే..?
గ్రామీణ ప్రాంతాల్లో బీపీవో కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ శాఖ ఐబీపీఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో కాకుండా చిన్న పట్టణాల్లో ఏర్పాటయ్యే బీపీవో యూనిట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ స్కీం కింద ఏర్పాటు చేసే ప్రతి సీటుకు గరిష్టంగా రూ.లక్ష ప్రోత్సాహం లభిస్తుంది. అదే మహిళలకు ఉపాధి కల్పిస్తే 5 శాతం, దివ్యాంగులకు మరో 5 శాతం అదనంగా ఆర్థిక ప్రయోజనం కల్పించనున్నారు. ఇందులో భాగంగా విశాఖలో అత్యధికంగా బీపీవో యూనిట్లు ఏర్పాటు కాగా భీమవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి పట్టణాలతో పాటు ప్రకాశం జిల్లా కందుకూరులో కూడా యూనిట్లు ఏర్పాటైనట్లు దూబే వివరించారు.

రాష్ట్రానికి మరిన్ని బీపీవో కంపెనీలు
రాష్ట్ర ప్రభుత్వం అను సరిస్తున్న పారిశ్రా మిక ప్రోత్సాహక వాతావరణంతో ఏపీలో మరిన్ని పెట్టు బడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు దూబే తెలిపారు. కరోనా సమ యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్ర మల పట్ల అనుసరించిన విధానం పారిశ్రామి క వేత్తల్లో నమ్మకాన్ని పెంచిందని, దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పలు బీపీవో కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నా యన్నా రు. ఇదే సమయంలో ఐబీపీఎస్‌ స్కీం కింద మరో 50 వేల సీట్లను కేటాయిం చే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందని, ఇది కూడా అమల్లోకి వస్తే రాష్ట్రానికి అత్యధికంగా బీపీవో కంపెనీలు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రాలు దక్కించుకున్న బీపీవో సీట్లు  

మరిన్ని వార్తలు