రాజమండ్రి జైలులో ‘ఇండియన్‌ –2’ షూటింగ్‌

21 Sep, 2019 12:07 IST|Sakshi
చిత్రీకరణలో పాల్గొన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌

రాజమహేంద్రవరం క్రైం: ప్రముఖ హీరో కమల్‌ హాసన్‌ నటిస్తున్న ఇండియన్‌ –2 సినిమా షూటింగ్‌ రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉత్సాహంగా జరుగుతోంది. ఐకా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం నాలుగో రోజు కొనసాగింది. జైలులో ఉన్న కమల్‌ హసన్‌ను పలకరించేందుకు హీరో సిద్ధార్థ, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వచ్చే సన్నివేశాలను  జైలు గేటు బయట చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో జూనియర్‌ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జైల్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ రాజారావు, డిఫ్యూటీ సూపరిండెంట్‌ కె. వెంకటరత్నం తదితరులు జైల్‌ బయట ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా