విజయవాడ నుంచి ఇండిగో సర్వీసులు

8 Feb, 2018 03:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ నుంచి మూడు నగరాలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రకటిం చింది. మార్చి 2 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు.

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రతి రోజు 3 సర్వీసులు, బెంగళూరు, చెన్నైలకు ఒక్కో సర్వీసు చొప్పున మొత్తం రోజుకు 5 సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు రూ.1,246, చెన్నైకు రూ.1,179, బెంగళూరుకు రూ. 1,826 ధరల నుంచి టికెట్లు అందుబా టులో ఉంచినట్లు తెలిపారు. వచ్చే 2,3 నెలల్లో ముంబై, ఢిల్లీలకు నేరుగా సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. ఉడాన్‌ పథకం కింద తిరుపతి నుంచి కొల్హా పూర్, కేరళలోని కానూర్‌లకు త్వరలో సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు