ఇందిరమ్మ విగ్రహం ధ్వంసం

12 Jul, 2018 13:14 IST|Sakshi
ధ్వంసమైన ఇందిరాగాంధీ విగ్రహం

మాచర్ల: పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారిలో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ  విగ్రహం ధ్వంసం చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విగ్రహం వద్ధ ధర్నా నిర్వహించారు. జోహార్‌ ఇందిరా.. జై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న అర్బన్‌ సీఐ సాంబశివరావు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులు పలువురు లారీ ఢీకొనడం వల్ల విగ్రహం ధ్వంసమైనట్లు తెలిపారు. లారీకి ట్రాక్టర్‌ అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయి విగ్రహాన్ని ఢీకొన్నట్లు వివరించారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాత్రం ఇది కుట్ర అని, తమ పార్టీని బతకనివ్వకూడదన్న దురుద్దేశంతో కొందరు ఇలా వ్యవహరించారని ఆరోపించారు. విగ్రహాన్ని ప్రతిష్టించకపోతే ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు