సమాచారం ఇవ్వకపోతే జరిమానా

11 Jul, 2014 02:48 IST|Sakshi

ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ
 అనంతపురం సప్తగిరి సర్కిల్:సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే వ్యక్తిగతంగా చేతి నుంచి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో స మాచార హక్కు చట్టం రాష్ట్ర కమిటీ సభ్యులు చలపతి, మఠం ఆనంద్‌కుమార్‌లతో కలిసి సమాచార హక్కు చట్టంపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
 
 ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ చాలా మంది అధికారులకు సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తును బుర్ర పెట్టి  చదివే ఓపిక లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తు దారుడు కోరిన సమాచారాన్ని 30 రోజులలోపు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో పీఐఓ, అప్పీలేట్ అథారిటీ వరకు వెళ్లే అవకాశం ఉందన్నారు. గతంలో పాడేర్ సబ్‌కలెక్టర్‌గా ఉండి(ప్రస్తుతం రిటైర్డ్ అయిన) ఐఏఎస్ స్థాయి అధికారి ఒకరికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు పెన్షన్ ఆపిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు.
 
 ప్రతి కార్యాలయంలో పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ), అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(ఏపీఐఓ) పేర్లు, ఫోన్ నంబర్‌లతో సమాచార బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమాచారం కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆయా డిపార్ట్‌మెంట్లు  అప్‌లోడ్ చేయాలని సూచించారు.  అనంతపురం తహశీల్దార్ కార్యాలయంలో బోర్డు ఏర్పాటు చేయలేదని సమాచార హక్కు కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకె ళ్లారు. 67 శాఖలకు గాను 32 శాఖలు సమాచారం అప్‌లోడ్ చేయలేదని డీఆర్వో హేమసాగర్ ఇన్‌చార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రంలోగా ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సోమవారం ప్రజావాణికి రిజిష్టర్‌లో నమోదు చేసుకుని తీసుకురావాలని డీఆర్వో సూచించారు. సమావేశంలో  హౌసింగ్ పీడీ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, పట్టుపరిశ్రమ జేడీ అరుణకుమారి, డీఈఓ మధుసూధన్‌రావు, అనంతపురం ఆర్డీఓ హుస్సేన్‌సాబ్, తదితరులు పాల్గొన్నారు.
 
 మసీదుల్లో మౌలిక సౌకర్యాలకు చర్యలు: పవిత్ర రంజాన్ మాసంను దృష్టిలో ఉంచుకుని మసీదుల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్  సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో మున్సిపల్, పోలీస్, మైనార్టీ, రెవెన్యూ, విద్యుత్ అధికారులతో స మావేశం నిర్వహించారు.
 
 ఆయన  మాట్లాడుతూ మసీదుల వద్ద తాగునీటిసౌకర్యం, పా రిశుద్ధ్యం, పోలీసు గస్తీ, షెహరీ, ఇఫ్తార్ వేళల్లో విద్యుత్ సరఫరా  ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.  కార్మిక శాఖ అధికారులు మసీదుల వద్ద పండ్ల వ్యాపారులు తోపుడుబండ్లు ఏర్పాటు చేసుకేనేందుకు అనుమతివ్వాలన్నారు.  సమావేశంలో డీఆర్వో హేమసాగర్, డీఎస్‌ఓ ఉమామహేశ్వర్‌రావు, మైనార్టీ కార్పొరేషన్ , మైనార్టీ సంక్షేమాధికారి,  పుట్టపర్తి, గుత్తి, క ళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
 
 ఆధార్ సీడింగ్‌పై అలసత్వం వహిస్తే చర్యలు :
 రేషన్‌కార్డులకు, ఉపాధి హామీ పెన్షన్‌లకు ఆధార్ సీడింగ్ విషయంలో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆదేశించారు.  పౌరసరఫరాలశాఖ, డ్వామా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.  రేషన్‌కార్డుల అనుసంధానం  వచ్చే వారానికి 75 శాతం పైబడి లక్ష్య సాధన ఉండాలని   అధికారులను ఆదేశించారు.
 
 ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు  
 జిల్లాలో ప్రజావాణిలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం తగదని ఇన్‌చార్జ్ కలెక్టర్ గురువారం ప్రజావాణి సమీక్షలో అధికారులకు సూచించారు.  ఏ కేటగిరిలో 15 రోజుల్లోగా డిస్పోజల్ చేయాల్సి ఉన్నా ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 అర్జీల కంటే ఎక్కువగా పెండిం గ్‌లో ఉన్న శాఖల వారీగా సమీక్షించారు.
 
 ప్రతి వారం ప్రజావాణికి వచ్చే ముందు ఎన్ని అర్జీలు పరిష్కారమయ్యాయి,ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు.
 

>
మరిన్ని వార్తలు