ఇన్ఫోసిస్ కళకళ.. సెన్సెక్స్ వెలవెల!

10 Oct, 2014 12:54 IST|Sakshi
ఇన్ఫోసిస్ కళకళ.. సెన్సెక్స్ వెలవెల!
2014-15 ఆర్ధిక సంవత్సరంలో రెండవ త్రైమాసిక (జూలై-సెప్టెంబర్) ఫలితాల్లో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ అంచనాలు అధిగమించింది. క్యూ2 ఫలితాల్లో 3096 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసుకుంది. గత వార్షిక ఆదాయంతో పోల్చుకుంటే వృద్దిరేటు 28.6 శాతం పెరిగింది. దాంతో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్ఫోసిస్ కంపెనీ షేరు విలువ భారీగా పెరిగింది. 
 
గురువారం నాటి మార్కెట్ లో ఇన్ఫోసిస్ 6.32 శాతం లాభంతో 3877 వద్ద ట్రేడ్ అవుతోంది. సిటీ గ్రూప్ డౌన్ రేటింగ్ తో గత కొద్దిరోజులుగా సర్దుబాటు గురైన ఇన్పోసిస్ తాజా ఫలితాలతో భారీ లాభాలను ఇన్వెస్టర్లు పంచుతోంది. 
 
అయితే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 218 పాయింట్లు క్షీణించి 26419 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల పతనంతో 7897 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో నాస్ డాక్ 90 పాయింట్లు కోల్పోగా, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. 
 
మరిన్ని వార్తలు