జగనిచ్చిన ‘దీపావళి’ 

27 Oct, 2019 08:26 IST|Sakshi
శ్రీనుకు స్వీట్సు తినిపిస్తున్న దృశ్యం

వలంటీర్‌కు సరికొత్త జీవితం 

ఓ అంధ అభ్యర్థి అంతరంగం

సాక్షి, విజయనగరం:  ఒక మంచి పని ఎందరో జీవితాలను నిలబెడుతుందనడానికి సజీవ సాక్ష్యం ఈ సంఘటన .. ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గ్రామ,వార్డు వలంటీర్ల నియామకం ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉన్న చోటనే ఉద్యోగం ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వ పధకాలను చేరువ చేయడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇన్నాళ్లూ ఉద్యోగం సజ్జోగం లేదంటూ చులకనగా  చూసిన ఈ సమాజం వారిని ఇప్పుడు గౌరవంగా చూస్తోంది.. ఇదంతా ఒకెత్తయితే చూపులేక, చేసేందుకు పని దొరక్క అవస్థలు పడుతున్న వారికి సైతం వలంటీర్‌ పోస్టులు లభించడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. వారు ఇప్పుడు నిజమైన దీపావళి జరుపుకుంటున్నారు. వారిలో ఒకరు బొబ్బిలి మండలం గొల్లపల్లికి చెందిన గొల్లపల్లి శ్రీను. అతనికి కంటి చూపులేదని చిన్న చూపు చూడకుండా ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది. పట్టుదలతో ఎంతటి కష్టమైన పనినైనా చేస్తున్నప్పటికీ ఇన్నాళ్లూ లభించని గుర్తింపు అతనికి సీఎం జగన్‌ వల్ల ఇప్పుడు దొరికింది.

ఇదో గొప్ప అనుభవం  
నేను బ్లైండ్‌ని.. ఈ రోజు నా లైఫ్‌లో వెరీ హ్యాపీ డే. ముందుగా వలంటీర్‌గా ఉద్యోగం కల్పించిన వైఎస్‌ జగన్‌ గారికి నా హదయ పూర్వక ధన్యవాదాలు. ఈ రోజు రైతు భరోసా అమౌంట్‌ పడిందని ఒక రైతు ఇంటికి వచ్చి స్వీట్‌ బాక్సు కూడా అభిమానంతో ఇచ్చాడు. తన సొంత అమౌంట్‌తో కొని మంచిగా ఉంటే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఈ రోజు తెలిసింది. ఇందుకు సహకరించిన అగ్రికల్చరల్‌ ఆఫీసర్, పీఈఓ మేడం, తోటి వలంటీర్స్‌కి స్పెషల్‌ ధ్యాంక్స్‌.
– గొల్లపల్లి శ్రీను 

మరిన్ని వార్తలు