విభజనకు నిరసనగా అర్ధనగ్నంగా ర్యాలీ

24 Aug, 2013 19:34 IST|Sakshi

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన సీమాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. సీమాంధ్ర జిల్లాలో అడుగడుగునా నిరనసలు, ధర్నాలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించింది. రాష్ర్టం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తాము ఉద్యమంలో పాల్గొంటున్నామని సీమాంధ్ర ప్రజలు వాపోతున్నారు.

 

రాష్ర్టం ముక్కలతై తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుసుకోవాలంటూ సీమాంధ్ర ప్రజలు మక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో తమ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని, ఇరుప్రాంతాలకు సమన్యాయం జరిగేలా తక్షణమే చర్చలు జరిపి సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా సమైక్యవాదులు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విజయనగరం కోట జంక్ష-న్‌లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. విభజనకు నిరసనగా ఆకులు కట్టుకుని అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ నుంచి ర్యాలీ నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులు.. వీధిపొడువునా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు న్యాయవాదులు జేఎసి సమైక్యాంధ్రాకు మద్దుతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కోటజంక్షన్‌లో కొనసాగుతూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు