వెలుగులోకి రాని లైంగికదాడులు కోకొల్లలు

28 Jul, 2018 13:32 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్సియా దరివాలా

చిన్నారులపై లైంగికదాడులను అరికట్టాలి

సామాజిక కార్యకర్త ఇన్సియా దరివాలా

పటమట(విజయవాడ తూర్పు): చిన్నారులపై జరిగే దారుణాలు చాలావరకు వెలుగులోకి రావటంలేదని, ఇందుకు తల్లిదండ్రులకు అవాగహన లేమి కారణమని, అన్ని ప్రాంతాల్లో పోలీసులు చిన్నారులపై జరుగుతున్న లైంగికదాడులపై చైతన్యం కల్పించాలని ముంబయికి చెందిన హ్యాండ్స్‌ ఆఫ్‌ హోప్‌ సంస్థ చైర్‌పర్సన్‌ ఇన్సియా దరివాలా అన్నారు. వాసవ్య మహిళా మండలి, మహిళా మిత్ర, నగరపోలీసు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మండలిలో మూడు రోజుల పాటు చిన్నారులపై లైంగికదాడులు అంశంపై జరుగుతున్న సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఆమె మాట్లాడుతూ చిన్నారులపై లైంగిక దాడులు ఎవరివల్ల జరుగుతున్నాయి, ఎంతమంది పోలీసు రిపోర్టు ఇస్తున్నారు,  రిపోర్టు చేయకపోవటానికి కారణాలు,  వేధింపులకు గురైనవారికి ఉన్న హక్కులు, చట్టాలు, వేధించినవారికి అమలయ్యే శిక్షలు, బాధితులకు అందే పథకాలు తదితర అంశాలను ఆమె వివరించారు. ఎక్కువగా బాలికపై జరిగే దాడులే వెలుగులోకి వస్తున్నాయని, బాలురపై కూడా 53 శాతం అఘాయిత్యాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీపీ వీవీ నాయుడు, వాస్యవ్య టెక్నికల్‌ సపోర్టర్‌ బి.కీర్తి. పలువురు పోలీసు అధికారులు, మహిళా మిత్రలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు