అర్హులకు అన్యాయం!

29 Sep, 2014 01:55 IST|Sakshi
అర్హులకు అన్యాయం!

పొందూరు:    పింఛన్ల తనిఖీ ప్రక్రియ చాలామంది అర్హులకు అన్యాయం చేసింది. అదే సమయంలో అనర్హు లకు, ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు పెద్దపీఠ వేసింది. చాలా ఏళ్లుగా సామాజిక పింఛన్లు అందుకుంటున్న వారు పేర్లను జాబితా నుంచి తీసేయడంతో వారు ఆవేదన చెందుతున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని, అనర్హులకు పింఛన్‌లు నిలుపుదల చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన మాటలు పొందూరు మండలంలో అమలు కావడం లేదు. చాలామంది అర్హుల పేర్లను పింఛన్ల జాబితా నుంచి తొలగించగా అనర్హుల పేర్లు మాత్రం కొనసాగుతున్నాయి.  దీనికి సింగూరు గ్రామాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డు, తెలుపు రేషన్ కార్డు, సదరం ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ జాబితాలో తమ పేర్లు లేవని ఇప్పటివరకూ పింఛన్ తీసుకుంటున్న టేకు పద్మావతి, సింగూరు లక్ష్మి, గుంట కోటేశ్వరరావు, తమ్మినేని పోలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసుకొంటూ బతుకుతున్న తమ పేర్లు పింఛన్ల జాబితాలో లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
 
 అర్హత ఉన్నా..పింఛన్ సున్నా..
  సింగూరు గ్రామానికి చెందిన టేకు పద్మావతి (విడో), తమ్మినేని పోలయ్య(వృద్ధాప్య)కు పింఛన్ ఈ నెల వరకు రూ. 200 అందాయి. భర్త చనిపోయినట్లు పద్మావతి వద్ద ధ్రువీకరణ పత్రం ఉంది. ఆమె అంత్యోదయ రేషన్ కార్డు నంబర్ వైఏపీ 101904200110, ఆధార్ కార్డు నంబర్ 201441335299. అలాగే తమ్మినేని పోలయ్య రేషన్ కార్డు నంబర్ డబ్ల్యూఏపీ 010904200033, ఆధార్ కార్డు నంబర్ 339587837790. సింగూరు లక్ష్మి (వికలాంగురాలు), గుంట కోటేశ్వరరావు(వికలాంగుడు)లకు ఈ నెల వరకు రూ.500 పింఛన్‌లు అందాయి. అరుుతే కొత్త పింఛన్ల జాబితాలో వీరి పేర్లు లేవు. 73 శాతంతో సదరం ధ్రువీకరణపత్రం వీరికి ఉంది. లక్ష్మీ రే షన్ కార్డు నంబర్ డబ్ల్యుఏపీ 010904200260, ఆధార్ కార్డు నంబర్ 615978999764. కోటేశ్వరరావు రేషన్ కార్డు నెంబర్ డబ్ల్యూఏపీ 010904200052. ఆధార్ కార్డు నంబర్ 210036084987. వీరికి అక్టోబర్ నుంచి పింఛన్‌లు రావనే విషయం తెలుసుకోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఎలా బతికేదని ఆందోళన చెందుతున్నారు.
 
 ఉద్యోగుల కుటుంబీకులకు పింఛన్లు !
  అదే గ్రామంలో కొందరు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వారి తల్లిదండ్రులకు కొత్త పింఛన్‌ల జాబితాలో స్థానం దక్కింది. తాండ్ర రవణమ్మ కుమారుడు రాము మిలటరీలో ఉద్యోగం చేస్తున్నారు. వారిద్దరిదీ ఒకే రేషన్ కార్డు(డబ్ల్యూఏపీ  010904200077) ఉన్నప్పటికీ పింఛన్‌ను తొలగించలేదు. పైగా కొత్త పింఛన్ల జాబితాలో కమిటీ సభ్యులు, అధికారులు చోటు కల్పించారు. అలాగే దుప్పల సరస్వతి కుమారుడు శేఖర్ బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం. వారి రేషన్ కార్డు నంబర్ డబ్ల్యూఏపీ  010904200204. బాడాన పెంటమ్మ కుమారుడు వెంకటేష్ సీఐఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం. వారి రేషన్ కార్డు నంబర్ 010904200233. సింగూరు భూచక్రం కుమారుడు హరికృష్ణ ఎస్‌బీఐలో ఉద్యోగం. రేషన్ కార్డు నంబర్ 010904200021. పైడి వరలక్ష్మి కుమారుడు శివకుమార్ సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం. రేషన్ కార్డు నంబర్ 010904200090. తమ్మినేని సరస్వతమ్మ కుమారుడు ప్రసాదరావు ఏఆర్‌లో ఉద్యోగం. రేషన్ కార్డు నంబర్ 010904200202. వీరి పేర్లను జాబితా నుంచి తొలగించకుండా కొత్తజాబితాలో చేర్చారు.
 
 రేషన్ కార్డు లేకపోయినా పింఛన్ జాబితాలో పేరు..
 వావిలపల్లి గౌరమ్మ. ఈమెకు సింగూరులో రేషన్ కార్డే లేదు. ఆమె  గ్రామంలో ఉండటం లేదని స్థానికులు తెలిపారు. అయినప్పటికీ ఆమెకు కొత్త పింఛన్ జాబితాలో అధికారులు పేరు నమోదు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పింఛన్ల తనిఖీలు చేపట్టాలని అధికారులకు, కమిటీ సభ్యులకు చెప్పిన ప్పటికీ వారంతా తూతూ మంత్రంగా ఈ ప్రక్రియ చేశారనేందుకు ఇదో మచ్చుతునక.

 

మరిన్ని వార్తలు